గురువారం, నవంబర్ 19, 2026

కీలకం - Keelaka Stotram

ఓం శ్రీ దుర్గాయై నమః

న్యాసం

ఓం అస్య శ్రీ కీలక మంత్రస్య | శివఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ మహాసరస్వతీ దేవతా | శ్రీజగదంబాప్రీత్యర్థం సప్తశతీపాఠాంగత్వేన జపే వినియోగః |

ఓం నమశ్చండికాయై |


మార్కండేయ ఉవాచ |

ఓం

విశుద్ధజ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే |

శ్రేయః ప్రాప్తినిమిత్తాయ నమః సోమార్ధధారిణే || 1 ||


సర్వమేతద్విజానీయాన్మంత్రాణామభి కీలకమ్ |

సోఽపి క్షేమమవాప్నోతి సతతం జాప్యతత్పరః || 2 ||


సిద్ధ్యంత్యుచ్చాటనాదీని వస్తూని సకలాన్యపి |

ఏతేన స్తువతాం దేవి స్తోత్రమాత్రేణ సిద్ధ్యతి || 3 ||


న మంత్రో నౌషధం తత్ర న కించిదపి విద్యతే |

వినా జాప్యేన సిద్ధ్యేత సర్వముచ్చాటనాదికమ్ || 4 ||


సమగ్రాణ్యపి సిద్ధ్యంతి లోకశంకామిమాం హరః |

కృత్వా నిమంత్రయామాస సర్వమేవమిదం శుభమ్ || 5 ||


స్తోత్రం వై చండికాయాస్తు తచ్చ గుప్తం చకార సః |

సమాప్తిర్న చ పుణ్యస్య తాం యథావన్నియంత్రణామ్ || 6 ||


సోఽపి క్షేమమవాప్నోతి సర్వమేవం న సంశయః |

కృష్ణాయాం వా చతుర్దశ్యామష్టమ్యాం వా సమాహితః || 7 ||


దదాతి ప్రతిగృహ్ణాతి నాన్యథైషా ప్రసీదతి |

ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్ || 8 ||


యో నిష్కీలాం విధాయైనాం నిత్యం జపతి సంస్ఫుటమ్ |

స సిద్ధః స గణః సోఽపి గంధర్వో జాయతే నరః || 9 ||


న చైవాప్యటతస్తస్య భయం క్వాపీ హ జాయతే | 

నాపమృత్యువశం యాతి మృతో మోక్షమవాప్నుయాత్ || 10 ||


జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత న కుర్వాణో వినశ్యతి |

తతో జ్ఞాత్వైవ సంపన్నమిదం ప్రారభ్యతే బుధైః || 11 ||


సౌభాగ్యాది చ యత్కించిద్దృశ్యతే లలనాజనే |

తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్యమిదం శుభమ్ || 12 ||


శనైస్తు జప్యమానేఽస్మిన్ స్తోత్రే సంపత్తిరుచ్చకైః |

భవత్యేవ సమగ్రాపి తతః ప్రారభ్యమేవ తత్ || 13 ||


ఐశ్వర్యం యత్ప్రసాదేన సౌభాగ్యారోగ్యసంపదః |

శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సా న కిం జనైః || 14 ||


|| ఇతి దేవ్యాః కీలక స్తోత్రమ్ సంపూర్ణం ||

బుధవారం, నవంబర్ 11, 2026

దేవ్యాః కవచం - Devi Kavacham

ఓం శ్రీ దుర్గాయై నమః

న్యాసః 

ఓం అస్య శ్రీ చండీకవచస్య | బ్రహ్మా ఋషిః | అనుష్టుప్ ఛందః | చాముండా దేవతా | అంగన్యాసోక్తమాతరో బీజమ్ | నవార్ణో మంత్ర శక్తిః |దిగ్బంధదేవతాస్తత్త్వమ్ | శ్రీజగదంబాప్రీత్యర్థే సప్తశతీపాఠాంగత్వేన జపే వినియోగః ||

ఓం నమశ్చండికాయై ||

మార్కండేయ ఉవాచ |

ఓం 

యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణామ్ |

యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ || 1 ||


బ్రహ్మోవాచ |

అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకమ్ |

దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే || 2 || 


ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || 3 ||


పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |

సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ || 4 ||


నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |

ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా || 5 ||


అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతో రణే |

విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః || 6 ||


న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే |

నాపదం తస్య పశ్యామి శోకదుఃఖభయం న హి || 7 || 


యైస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధిః ప్రజాయతే |

యే త్వాం స్మరంతి దేవేశి రక్షసే తాన్న సంశయః || 8 ||


ప్రేతసంస్థా తు చాముండా వారాహీ మహిషాసనా |

ఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా || 9 ||


మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా |

లక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియా || 10 ||


శ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనా |

బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా || 11 ||


ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః |

నానాభరణశోభాఢ్యా నానారత్నోపశోభితాః || 12 ||


దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః |

శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధమ్ || 13 ||


ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ |

కుంతాయుధం త్రిశూలం చ శార్ఙ్గమాయుధముత్తమమ్ || 14 ||


దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ |

ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై || 15 ||


నమస్తేఽస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే |

మహాబలే మహోత్సాహే మహాభయవినాశిని || 16 ||


త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని |

ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యామగ్నిదేవతా || 17 ||


దక్షిణేఽవతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీ |

ప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయవ్యాం మృగవాహినీ || 18 ||


ఉదీచ్యాం పాతు కౌమారీ ఐశాన్యాం శూలధారిణీ |

ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేదధస్తాద్-వైష్ణవీ తథా || 19 ||


ఏవం దశ దిశో రక్షేచ్చాముండా శవవాహనా |

జయా మే చాగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః || 20 ||


అజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజితా |

శిఖాముద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితా || 21 ||


మాలాధరీ లలాటే చ భ్రువౌ రక్షేద్యశస్వినీ |

త్రినేత్రా చ భ్రువోర్మధ్యే యమఘంటా చ నాసికే || 22 ||


శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీ |

కపోలౌ కాలికా రక్షేత్కర్ణమూలే తు శాంకరీ || 23 ||


నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్ఠే చ చర్చికా |

అధరే చామృతకలా జిహ్వాయాం చ సరస్వతీ || 24 ||


దంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికా |

ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే || 25 ||


కామాక్షీ చిబుకం రక్షేద్-వాచం మే సర్వమంగళా |

గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ || 26 ||


నీలగ్రీవా బహిః కంఠే నలికాం నలకూబరీ |

స్కంధయోః ఖడ్గినీ రక్షేద్-బాహూ మే వజ్రధారిణీ || 27 ||


హస్తయోర్దండినీ రక్షేదంబికా చాంగులీషు చ |

నఖాం ఛూలేశ్వరీ రక్షేత్-కుక్షౌ రక్షేత్కులేశ్వరీ || 28 ||


స్తనౌ రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీ |

హృదయే లలితా దేవీ ఉదరే శూలధారిణీ || 29 ||


నాభౌ చ కామినీ రక్షేద్-గుహ్యం గుహ్యేశ్వరీ తథా |

పూతనా కామికా మేఢ్రం గుదే మహిషవాహినీ || 30 ||


కట్యాం భగవతీ రక్షేజ్జానునీ వింధ్యవాసినీ |

జంఘే మహాబలా రక్షేత్-సర్వకామప్రదాయినీ || 31 ||


గుల్ఫయోర్నారసింహీ చ పాదపృష్ఠే తు తైజసీ |

పాదాంగులీషు శ్రీ రక్షేత్-పాదాధస్తలవాసినీ || 32 ||


నఖాన్ దంష్ట్రాకరాలీ చ కేశాంశ్చైవోర్-ధ్వకేశినీ |

రోమకూపేషు కౌబేరీ త్వచం వాగీశ్వరీ తథా || 33 ||


రక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీ |

అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరీ || 34 ||


పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథా |

జ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు || 35 ||


శుక్రం బ్రహ్మాణి మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా |

అహంకారం మనో బుద్ధిం రక్షేన్మే ధర్మధారిణీ || 36 ||


ప్రాణాపానౌ తథా వ్యానముదానం చ సమానకమ్ |

వజ్రహస్తా చ మే రక్షేత్-ప్రాణం కళ్యాణశోభనా || 37 ||


రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగినీ |

సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా || 38 ||


ఆయూ రక్షతు వారాహీ ధర్మం రక్షతు వైష్ణవీ |

యశః కీర్తిం చ లక్ష్మీం చ ధనం విద్యాం చ చక్రిణీ || 39 ||


గోత్రమింద్రాణి మే రక్షేత్-పశూన్ మే రక్ష చండికే |

పుత్రాన్ రక్షేన్-మహాలక్ష్మీర్-భార్యాం రక్షతు భైరవీ || 40 ||


పంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమకరీ తథా |

రాజద్వారే మహాలక్ష్మీర్-విజయా సర్వతః స్థితా || 41 ||


రక్షాహీనం తు యత్-స్థానం వర్జితం కవచేన తు |

తత్సర్వం రక్ష మే దేవి జయంతీ పాపనాశినీ || 42 ||


పదమేకం న గచ్ఛేత్తు యదీచ్ఛేచ్ఛుభమాత్మనః |

కవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్ఛతి || 43 ||


తత్ర తత్రార్థలాభశ్చ విజయః సార్వకామికః |

యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్ || 44 ||


పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్ |

నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితః || 45 ||


త్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః పుమాన్ |

ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్ || 46 ||


యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః |

దైవీకలా భవేత్తస్య త్రైలోక్యేష్వపరాజితః || 47 ||


జీవేద్-వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః |

నశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయః || 48 ||


స్థావరం జంగమం చైవ కృత్రిమం చాపి యద్విషమ్ |

అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే || 49 ||


భూచరాః ఖేచరాశ్చైవ జలజాశ్చోపదేశికాః |

సహజా కులజా మాలా డాకినీ శాకినీ తథా || 50 ||


అంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహాబలాః |

గ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాః || 51 ||


బ్రహ్మరాక్షసవేతాలాః కూష్మాండా భైరవాదయః |

నశ్యంతి దర్శనాత్తస్య కవచే హృది సంస్థితే || 52 ||


మానోన్నతిర్-భవేద్-రాజ్ఞస్-తేజోవృద్ధికరం పరమ్ |

యశసా వర్ధతే సోఽపి కీర్తిమండితభూతలే || 53 ||


జపేత్సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురా |

యావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్ || 54 ||


తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీ |

దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభమ్ || 55 ||


ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతః |

లభతే పరమం రూపం శివేన సహ మోదతే || 56 ||


|| ఇతి శ్రీమార్కండేయపురాణే హరిహరబ్రహ్మవిరచితం దేవ్యాః కవచం సంపూర్ణం ||

శుక్రవారం, మార్చి 13, 2026

అఖారాలు / అఖాడాలు Akharas / Akhadas

 అఖారాలు / అఖాడాలు :

అఖాడాలు అనగా మతపరమైన విభాగాలు లేదా సంస్థలు అని అర్ధం. వీటి ఉనికి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్‌లలో గతంలో నిర్వహించబడిన కుంభమేళాల నాటిది. హిందూ మతంలో, అఖారాలకు వాటి స్వంత ప్రాముఖ్యత ఉంది. ఇవి సనాతన ధర్మంలో అంతర్భాగంగా ఏర్పడ్డాయి.

స్థూలంగా చెప్పాలంటే, హిందువులను బలవంతపు మతమార్పిడుల నుండి రక్షించడానికి మరియు వైదిక ధర్మాన్ని కాపాడటం కోసం జగద్గురువు ఆదిశంకరాచార్యులచే ఏర్పాటు చేయబడినవే ఈ అఖాడాలు. 

ఆదిశంకరాచార్యులు 7 అఖాడాలని స్థాపించారని చరిత్ర చెప్తుంది. 

1) మహానిర్వాణి అఖాడా  
2) అటల్ అఖాడా 
3) నిరంజని అఖాడా 
4) ఆనంద్ అఖాడా 
5) భైరవ అఖాడా 
6) ఆవాహన్ అఖాడా
7) అగ్ని / హవన్ అఖాడా 

ఆదిశంకరాచార్యులవారు స్థాపించిన ఈ 7 అఖాడాలతో కలిపి, జనవరి 2019 నాటికి, 13 అఖారాలు అధికారికంగా గుర్తించబడ్డాయి. వీటిలో జునా అఖాడా అతి పెద్దది. 

ఈ 13 అఖాడాలను కలిపి మూడు వర్గాలుగా వర్గీకరించారు. 

1) నిర్వాణి అని అఖాడ, (7)
2) దిగంబర్ అని అఖాడ, (3)
3) నిర్మల్ అని అఖాడ. (3)

నిర్వాణి అని అఖాడా (7 అఖాడాల సమూహం) :

నిర్వాణి అని అఖాడాలో సాధువులు మరియు నాగ సాధువుల కోసం అత్యధిక సంఖ్యలో 7 అఖాడాలు ఉన్నాయి.

1) శ్రీ పంచదశనామ జునా అఖాడా (వారణాసి) : 

ఇది 13 అఖాడాలలో పెద్దది. ఆదిశంకరాచార్యులవారిచే స్థాపించబడిన జునా అఖాడా, శైవమతం యొక్క దశనామి సంప్రదాయానికి కట్టుబడి ఉంటుంది. వీరు దత్తాత్రేయ భగవానుని ఆరాధిస్తారు. కిన్నార్ అఖాడా (ట్రాన్స్‌జెండర్ అఖాడా) కూడా జునా అఖాడాలో భాగం.

2) శ్రీ పంచాయతి నిరంజని అఖాడా (ప్రయాగ్‌రాజ్) : 

రెండవ అతిపెద్ద అఖాడాగా ప్రసిద్ధి గాంచిన శ్రీ పంచాయతి నిరంజని అఖాడా, 904 ADలో గుజరాత్‌లో స్థాపించబడింది. ఈ అఖాడాలోని యోగులు ప్రధానంగా కార్తికేయుడిని పూజిస్తారు. ముఖ్యంగా డాక్టర్, పోస్ట్-గ్రాడ్యుయేట్ వంటి డిగ్రీలను కలిగి ఉన్న వ్యక్తులతో పాటు, చాలా మంది ఉన్నత విద్యావంతులైన సభ్యులను కలిగి ఉంది ఈ అఖాడా. ఇది ఆధ్యాత్మిక మరియు విద్యాపరమైన విషయాలకు నిలయంగా ఉంది.

3) శ్రీ పంచ్ అటల్ అఖాడా (వారణాసి) : 

మూడు పురాతన అఖాడాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ శ్రీ పంచ్ అటల్ అఖాడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ అఖాడాలోని భక్తులు విఘ్నాలను తొలగించే గణేశుడిని పూజిస్తారు. ఇంకా వీరు పవిత్ర దైవిక చిహ్నాలైన భైరవ ప్రకాష్ భాల మరియు సూర్య ప్రకాష్ భాలలను గౌరవిస్తారు. ఉన్నత సంప్రదాయాలు, క్లిష్టమైన ఆధ్యాత్మిక అభ్యాసాలు కలిసి ఈ అఖాడాను మత పరంగా ఒక ముఖ్యమైన స్థానంలో నిలిపాయి.

4) శ్రీ పంచదశనామ ఆవాహన్ అఖాడా (వారణాసి) : 

అతి పురాతన సన్యాసుల అఖాడాగా గుర్తింపు పొందిన శ్రీ పంచదశనామ ఆవాహన్ అఖాడాకు గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వం ఉంది. ఇక్కడ భక్తులు త్రిమూర్తుల అవతారంగా భావించే దత్తాత్రేయ భగవానుని పూజిస్తారు. ఈ అఖాడా యొక్క పురాతన సంప్రదాయాలు, బోధనలు పరంపరానుగతంగా సంరక్షించబడి, తరువాతి తరాలకు అందించబడ్డాయి, ఇది వారణాసిలో సన్యాస జీవితానికి, ఆధ్యాత్మిక అభ్యాసానికి మూలస్తంభంగా మారింది.

5) తపోనిధి శ్రీ ఆనంద్ పంచాయితీ అఖాడా (నాసిక్) : 

రెండవ పురాతన అఖాడాగా, తపోనిధి శ్రీ ఆనంద్ పంచాయితీ అఖాడా ఆధ్యాత్మిక ప్రపంచంలో గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ పూజించబడే ప్రధాన దైవం ప్రత్యక్ష పరమేశ్వరుడు అయిన సూర్యనారాయణుడు. ఇది దైవిక కాంతిని, శక్తిని సూచిస్తుంది. దీర్ఘకాలం నుండి వస్తున్న సంప్రదాయాలు, భక్తి, ఆధ్యాత్మిక బోధనలు, ఆచారాలను సంరక్షించడంలో ఈ అఖాడా ప్రముఖ పాత్రను పోషిస్తుంది.

6) శ్రీ పంచాయతి మహానిర్వాణి అఖాడా (ప్రయాగ్‌రాజ్) : 

శ్రీ పంచాయతి మహానిర్వాణి అఖాడాలో ప్రధాన దైవం కపిలముని. ఆయన లోతైన జ్ఞానం మరియు ఆధ్యాత్మిక బోధనలకు పూజ్యుడు. ఈ అఖాడాలోని సాధకులు దైవిక రక్షణ, జ్ఞానోదయాన్ని సూచించే భైరవ ప్రకాష్ భాల మరియు సూర్య ప్రకాష్ భాల వంటి పవిత్ర చిహ్నాలను పూజిస్తారు. ఈ అఖాడా సాధకుల గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం, సాధనా పద్ధతులు ఈ అఖాడాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

7) శ్రీ పంచదశనామ పంచాగ్ని అఖాడా / శ్రీ శంభు పంచాగ్ని అఖాడా (జునాగర్) :

బ్రహ్మచారి సన్యాసులతో కూడిన ఈ అఖాడాలోని సాధువుల విశిష్ట అభ్యాసాల వలన ఇతర శైవ అఖాడాలకు ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇతర శైవ అఖాడాలలో పాటించే అగ్ని యాగం (ధుని) సంప్రదాయం వీరు పాటించరు. వీరు మత్తు పదార్థాలను తీసుకోకుండా ఉంటారు. ఇంకా, ఈ అఖాడాలోని సాధువులు వారి ఆధ్యాత్మిక నిబద్ధత మరియు స్వచ్ఛతకు చిహ్నంగా పవిత్రమైన దారానికి (జనౌ) కట్టుబడి ఉంటారు. ఇలాంటి విలక్షణమైన ఆచారాలు, సన్యాసం, ధర్మబద్ధమైన జీవనం పట్ల వారి అచంచలమైన అంకితభావాన్ని చూపిస్తున్నాయి.

దిగంబర్ అని అఖాడా (3 అఖాడాల సమూహం) :

దిగంబర్ అని అఖాడా అనేది వైష్ణవానికి అంకితమైనది. ఇది విష్ణువును ఆరాధించే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సమూహంలో మూడు విభిన్న అఖాడాలు ఉన్నాయి. వీటిని బైరాగి అఖాడాలుగా పిలుస్తారు. ప్రతి అఖాడా విష్ణువు యొక్క ఆరాధన మరియు బోధనల పట్ల గాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. వైష్ణవ సూత్రాలు, ఆచారాలకు వారు కట్టుబడి ఉండటం మరియు దైవం పట్ల వారికి గల భక్తి ఈ అఖాడా సమూహాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

8) శ్రీ నిర్మోహి అని అఖాడా (మధుర) :

బృందావన్‌లో స్థాపించబడిన శ్రీ నిర్మోహి అని అఖాడా 18 వైష్ణవ సమూహాల సమ్మేళనం ద్వారా ఏర్పడింది. ఈ అఖాడాలోని భక్తులు హనుమంతుని పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. హనుమంతుడు అచంచలమైన భక్తి, విధేయత మరియు బలానికి ప్రసిద్ధి చెందిన దేవుడు. హనుమంతుడి వలే ఈ అఖాడా సాధువులు కూడా విష్ణువు పట్ల భక్తి మరియు ఆరాధనను కలిగి ఉంటారు. అందువలెనే భక్తి పరంగా ఈ అఖాడా ప్రత్యేకతను సంతరించుకుంది.

9) శ్రీ దిగంబర్ అని అఖాడా (సబర్కాంత) :

సబర్‌కాంతలో ఉన్న శ్రీ దిగంబర్ అని అఖారా ఆధ్యాత్మిక ప్రకృతి దృశ్యం యొక్క విలక్షణమైన కోణాన్ని సూచిస్తుంది. వైష్ణవ సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిన ఈ అఖారా, విష్ణువు యొక్క ఆరాధన మరియు బోధనలకు అంకితం చేయబడింది. దాని పవిత్ర ప్రాంగణంలో, భక్తులు ఆధ్యాత్మిక సహవాసం మరియు భక్తి భావాన్ని పెంపొందించడం ద్వారా లోతైన ఆచారాలు మరియు అభ్యాసాలలో పాల్గొంటారు. సబర్‌కాంతలో అఖారా ఉనికి ఈ ప్రాంతంలోని హిందూ ఆధ్యాత్మికత మరియు సంస్కృతి యొక్క గొప్ప వస్త్రాన్ని నిలబెట్టడంలో మరియు సంరక్షించడంలో దాని సమగ్ర పాత్రను ప్రతిబింబిస్తుంది.

10) శ్రీ నిర్వాణి అని అఖాడా (అయోధ్య) :

పవిత్రమైన అయోధ్యలో నెలకొని ఉన్న శ్రీ నిర్వాణి అని అఖాడా ఆధ్యాత్మిక భక్తి మరియు ఆరాధనల పుణ్యక్షేత్రం. పురాతన సంప్రదాయాలలో పాతుకుపోయిన ఈ అఖాడా ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు స్వీయ-సాక్షాత్కార మార్గానికి గాఢమైన నిబద్ధతను కలిగి ఉంటుంది. దైవిక ఆశీర్వాదాలు మరియు అంతర్గత పరివర్తనను కోరుతూ, క్లిష్టమైన ఆచారాలు మరియు అభ్యాసాలలో పాల్గొనడానికి భక్తులు దాని పవిత్రమైన హాళ్లలో గుమిగూడారు. అయోధ్యలో ఉన్న శ్రీ నిర్వాణి అని అఖారా నగరం యొక్క శాశ్వతమైన ఆధ్యాత్మిక వారసత్వానికి మరియు తీర్థయాత్ర మరియు భక్తికి కేంద్రంగా దాని ప్రాముఖ్యతకు నిదర్శనంగా పనిచేస్తుంది.

నిర్మల్ అని అఖాడా :

ఉదాసీన్‌గా సూచించబడే నిర్మల్ అని అఖాడా సన్యాసం మరియు ధ్యానం అనే సంప్రదాయాన్ని కలిగి ఉంటుంది. ఈ అఖాడా వర్గంలో మూడు అఖాడాలు ఉన్నాయి. 

11) శ్రీ పంచాయితీ బడా ఉదాసిన్ అఖాడా (ప్రయాగ్రాజ్) :

ఈ అఖాడాలోని భక్తులు గురునానక్ గౌరవనీయమైన పెద్ద కుమారుడు శ్రీ చంద్ బోధనలకు దగ్గరగా కట్టుబడి ఉంటారు. 1825లో హరిద్వార్‌లో యోగిరాజ్ శ్రీ నిర్వాందేవ్ జీ మహారాజ్ చేత స్థాపించబడిన ఈ అఖాడా జ్ఞానోదయ మార్గానికి అంకితమైన ఆధ్యాత్మిక అన్వేషకులకు అభయారణ్యంగా పనిచేస్తుంది.

12) శ్రీ పంచాయితీ నయా ఉదాసిన్ అఖాడా (హరిద్వార్) :

1846లో మహంత్ సుధీర్ దాస్ హరిద్వార్‌లో స్థాపించిన ఈ అఖాడా శ్రీ పంచాయితీ బడా ఉదాసిన్ అఖాడాలోని వివాదం నుండి ఉద్భవించింది. అల్లకల్లోలమైన మూలాలు ఉన్నప్పటికీ, ఇది ఆధ్యాత్మిక భక్తి మరియు క్రమశిక్షణకు ఒక దీపస్తంభంగా నిలుస్తుంది.

13) శ్రీ నిర్మల్ పంచాయతీ అఖాడా (హరిద్వార్) :

నిర్మల్ సంప్రదాయంలో పాతుకుపోయిన ఈ అఖాడా 1856లో పంజాబ్‌లో దుర్గా సింగ్ మహారాజ్ స్థాపించిన దాని మూలాలను గుర్తించింది. సనాతన పద్ధతిలో సిక్కుమతంతో సన్నిహిత సంబంధాలతో, ఇది ఆధ్యాత్మిక సంప్రదాయాల సామరస్య సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది, దాని అనుచరుల మధ్య ఐక్యత మరియు గౌరవాన్ని పెంపొందిస్తుంది.


 






ప్రార్ధనా శ్లోకాలు

ప్రారంభ శ్లోకాలు

॥  ఓం ॥

శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే ॥ 


యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం ।

విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥


గురురేవ గతిర్ గురు మేవ భజే 

గురు నైవ సహస్మి నమో గురవే  ।

న గురోః పరమం శిసురస్మి గురోః

మతిరస్తి  గురౌ మామ పాహి గురో ॥


ఓం సహ నావవతు । సహ నౌభునక్తు ।

సహవీర్యం కరవావహై ।

తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ॥

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


సదాశివ సమారంభామ్ వ్యాస శంకర మధ్యమాం । 

అస్మదాచార్య పర్యంతాం వన్దే గురు పరంపరాం ॥


గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః ।

గురుః సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీగురవే నమః  ॥


జ్ఞానానందమయం దెేవం నిర్మల స్ఫటికాకృతిం ।

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ॥


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ।

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః  ॥


అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।

తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః  ॥


సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి ।

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ 


అంత్య శ్లోకాలు


ఓం సర్వేషాం స్వస్తిర్భవతు । సర్వేషాం శాన్తిర్భవతు ।

సర్వేషాం పూర్ణం భవతు । సర్వేషాం మఙ్గలం భవతు ।


సర్వే భవన్తుసుఖినః సర్వే సన్తునిరామయాః ।

సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్ దుఃఖ భాగ్భవేత్ ।

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


ఓం అసతో మా సద్గమయ ।

తమసో మా జ్యోతిర్గమయ ।

మృత్యోర్మా అమృతం గమయ ।

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥  


ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ।  

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥  


కాయేన వాచా మనసేంద్రియైర్వా ।

బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।

కరోమి యద్యత్ సకలం పరస్మై ।

నారాయణాయేతి సమర్పయామి ॥


యదక్షర పదభ్రష్టం మాత్రా హీనన్తుయద్భవేత్ ।

తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తుతే ॥


విసర్గ బిన్దు మాత్రాణి పద పాదాక్షరాణి చ ।

న్యూనానిచ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ ॥


అపరాధసహస్రాణి క్రియన్తేఽహర్నిశం మయా ।

తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమ ॥




రోగనివారణ శ్లోకాలు - Roga Nivarana Slokas


అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ ।

నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ ॥


భావం:

“అచ్యుత, అనంత, గోవింద” అనే భగవన్నామాలను ఉచ్చరించడం వల్ల అన్ని రోగాలు నశిస్తాయి — ఇది సత్యం సత్యం సత్యం...


బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ । జపేన్నామత్రయం నిత్యం మహారోగ నివారణమ్ ॥ భావం: “బాలాంబికేశ, వైద్యేశ, భవరోగహర” అనే మూడు నామాలను నిత్యం జపిస్తే మహా రోగాలు కూడా నివారణమవుతాయి.


సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం

విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః ।

కరాలం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా

న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా ॥


భావం:

ఈ శ్లోకం జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి లోని 28వ శ్లోకం.


దేవతలు అమృతాన్ని సేవించినప్పటికీ కాలానికి లోబడి నశిస్తారు. కానీ శివుడు భయంకరమైన కాలకూట విషాన్ని మింగినా ఆయనకు ఎలాంటి హాని కలగలేదు. దానికి మూల కారణం అమ్మవారి తాటంకాల(చెవి కుండలాలు) మహిమ.


కిరంతీమంగేభ్యః కిరణనికురుంబామృతరసం

హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ।

స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ

జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా ॥


భావం:

ఈ శ్లోకం జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి లోని 20వ శ్లోకం.


ఓ జగన్మాతా! చంద్రకాంత శిల వలె చల్లని అమృత కిరణాలను కురిపించే నీ దివ్య రూపాన్ని హృదయంలో ధ్యానించే భక్తుడు, గరుత్మంతుని వలె సర్పాల విష ప్రభావాన్ని అణిచివేయగలడు. అంతేకాక, తన చల్లని చూపులతో తీవ్రమైన జ్వరంతో బాధపడేవారిని కూడా అమృత ధారల వలె స్వస్థపరుస్తాడు. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల విష భయాలు, తీవ్రమైన జ్వరాల నుండి విముక్తి కలుగుతుంది.