అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ ।
నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ ॥
భావం:
“అచ్యుత, అనంత, గోవింద” అనే భగవన్నామాలను ఉచ్చరించడం వల్ల అన్ని రోగాలు నశిస్తాయి — ఇది సత్యం సత్యం సత్యం...
బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ । జపేన్నామత్రయం నిత్యం మహారోగ నివారణమ్ ॥ భావం: “బాలాంబికేశ, వైద్యేశ, భవరోగహర” అనే మూడు నామాలను నిత్యం జపిస్తే మహా రోగాలు కూడా నివారణమవుతాయి.
సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః ।
కరాలం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా ॥
భావం:
ఈ శ్లోకం జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి లోని 28వ శ్లోకం.
దేవతలు అమృతాన్ని సేవించినప్పటికీ కాలానికి లోబడి నశిస్తారు. కానీ శివుడు భయంకరమైన కాలకూట విషాన్ని మింగినా ఆయనకు ఎలాంటి హాని కలగలేదు. దానికి మూల కారణం అమ్మవారి తాటంకాల(చెవి కుండలాలు) మహిమ.
కిరంతీమంగేభ్యః కిరణనికురుంబామృతరసం
హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ।
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా ॥
భావం:
ఈ శ్లోకం జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి లోని 20వ శ్లోకం.
ఓ జగన్మాతా! చంద్రకాంత శిల వలె చల్లని అమృత కిరణాలను కురిపించే నీ దివ్య రూపాన్ని హృదయంలో ధ్యానించే భక్తుడు, గరుత్మంతుని వలె సర్పాల విష ప్రభావాన్ని అణిచివేయగలడు. అంతేకాక, తన చల్లని చూపులతో తీవ్రమైన జ్వరంతో బాధపడేవారిని కూడా అమృత ధారల వలె స్వస్థపరుస్తాడు. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల విష భయాలు, తీవ్రమైన జ్వరాల నుండి విముక్తి కలుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి