శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

భగవాన్ రమణ మహర్షి తొలి రోజులు

అది 1879 సం. డిసెంబర్‌ 29 వ తేదీ. స్థలం దక్షిణభారతం తమిళనాడులోని తిరుచ్చుళి క్షేత్రం. శివుని పంచమూర్తులలోని నటరాజ ఆనందమూర్తి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పెద్ద వేడుకతో జరిపే ‘ఆరుద్ర దర్శనం’ అనే వుత్సవ సమయం… గొప్ప సందడితో కోలాహలంగా ఉంది. అక్కడి శ్రీభూమినాథేశ్వర ఆలయంలోని ఉత్సవమూర్తులను అలంకరించి రథంపై వీధుల వెంబడి నడిపే ఊరేగింపు రోజంతా సాగి రాత్రికూడా కొనసాగుతుంది. అర్థరాత్రి దాటి డిసెంబర్‌ 30వ తేది ప్రవేశించింది. సరిగ్గా ఒంటిగంటకు కోవెలను ఆనుకుని ఉన్న ఇంట్లో ఒక మగశిశువు జన్మించాడు. సుందరం అయ్యర్‌, అళగమ్మ అనే పుణ్య దంపతులు ఆ బిడ్డకు తల్లిదండ్రులు. వేంకటేశ్వరన్ అని నామకరణం చేయబడిన ఆ శిశువే కాలక్రమంలో స్కూల్‌లో వేంకటరామన్ అయి భగవాన్‌ శ్రీరమణమహర్షి అని ఖ్యాతిగాంచాడు. ప్రసవ సమయంలో ఉన్న ఒక అంధురాలికి ఆ దివ్యశిశువు తేజోరాశి మధ్యలో ఉన్నట్లు కనబడింది!

వేంకట్రామన్‌ బాల్యారంభం సాధారణం. తోటివారితో ఆటలు పాటలు… హాయిగా గడిచింది. ఆరేళ్ళ ప్రాయంలో ఓసారి అతడు తండ్రిగారి కోర్టు కాయితాలతో పడవలు చేసి ఆడుకోగా తండ్రి మందలించారు. అంతే, బాలుడు కనబడకుండా పోయాడు. ఎంతో వెతుకులాట అయ్యాక, పక్క గుళ్ళో జగన్మాత ప్రతిమ వెనుక కనబడ్డాడు పూజారికి. అలా తెలియని వయసులో కూడా ప్రాపంచిక సంకటాలనుంచి ఉపశమనానికై దైవసన్నిధినే ఆశ్రయించడం అతని భవిష్యత్‌ జీవితానికి సంకేతం.

వీధిబడి చదువు తిరుచ్చుళిలో పూర్తిచేసి తరువాత క్లాసులకు దిండిగల్‌ చేరాడు.1892 లో తండ్రి మరణం కుటుంబాన్ని కొంత అస్తవ్యస్తం చేసింది. వేంకట్రామన్‌, అన్నతో కలిసి, మధురైలో ఉంటున్న పినతండ్రి సుబ్బయ్యర్‌ ఇంటికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరు పిల్లలు తల్లితో ఉండిపోయారు. మధురలో వేంకట్రామన్‌ చదువు ముందు స్కాట్స్‌ మిడిల్‌ స్కూల్‌లోను, తరువాత అమెరికన్‌ మిషన్‌ హైస్కూల్లోను సాగింది.

స్కూల్‌ చదువులకంటే ఆటలంటేనే పిల్లవాడికి ప్రీతి. తనకున్న అద్భుత జ్ఞాపకశక్తితో విన్న పాఠాలు వెంటనే అప్పచెప్పేవాడు. అయితే, అతనికున్న వింత లక్షణం ఒకటే – మొద్దునిద్ర. ఎంత గాఢం అంటే, అతన్ని లేపడం ఓ బ్రహ్మ ప్రళయం! అతన్ని ఎదరించలేని తోటి కుర్రాళ్ళు, కక్షకట్టి రాత్రివేళ గాఢనిద్రలో ఉండగా, అతన్ని దూరంగా ఈడ్చుకెళ్ళి తనివితీరా బాదేవారట. అయినా, అతనికి రవంత కూడా ఎరుక ఉండదు. ఏం చోద్యం?!

ఓసారి బంధువొకరు రాగా వేంకట్రామన్‌, ”ఎక్కడనుంచి వస్తున్నారు?” అని వారిని అడిగాడు. ”అరుణాచలం” అన్నారాయన. గొప్ప ఆశ్చర్యంతో బాలుడు, ”అరుణాచలమా, అదెక్కడండీ?” అంటాడు. బాలుని అమాయకతకు జాలిపడి ఆయన ”అరుణాచలం అంటే తిరువణ్ణామలయే” అన్నారు. ఇదే సంఘటనను తరువాత కాలంలో స్వామి తన రచనలో పేర్కొన్నారు.

ద్వి|| 1. అరయరాని గిరిగ నమరియుం డహహ;

అతిశయ మీ సేత లరయు వా రెవరు?

అరయరాని చిరువయసు మొద లరుణ

గిరి చాల ఘనమని యెఱుకలో మెఱయ

నరయ లే దది తిరువణ్ణామల యని

దెలిసియు నొకరిచే దీని యర్థమును

ఎఱుకను మఱుగిడి యీడ్వ దాపునకు

నరిగిన సమయమం దచలమై గంటి. (అరుణాచల అష్టకం)

అనతికాలంలోనే, పెరియపురాణం (శివభక్తవిలాసం) అనే గ్రంథాన్ని మొదటిసారిగా చదివాడు యువకుడైన వేంకట్రామన్‌. పరమేశ్వరునికి ‘తను మన ధన ప్రాణ మానము’లను అర్పించుకున్న 63 నాయనార్ల అద్భుత గాథలవి. వారి భక్తి, విశ్వాసం, దివ్యావేశాలకు ముగ్ధుడై, అసలట్టి భక్తి తీవ్రత ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపడేవాడు. త్యాగభరితమై, పరమేశ్వర సాయుజ్యానికి దారితీసే ఆ గాథలతనిని పరవశమొనర్చి, సాధుమార్గమును అనుసరించుటకై ఉరకలెత్తించేవి. నాటినుంచి అతనిలో ఓ దివ్యప్రేరణ వికసించసాగింది. దాని అనుభూతిని వారే, తన సహజ చమత్కార సరళ సరళిలో వివరించారు: ”ముందు అదో జ్వరం కాబోలు అనుకున్నాను. అయితే ఏం, హాయిగా ఉంది కదా, ఉండనిమ్మని ఊరుకున్నాను” అన్నారు.

భగవాన్ రమణ మహర్షి మరణానుభవం

వేంకటరామన్‌(భగవాన్ రమణ మహర్షి) జీవితంలోని గొప్ప మలుపు సంభవించింది 1896 జులై మధ్యలో. ఓ మిట్టమధ్యాహ్నపు వేళ అకస్మాత్తుగా, ఊహించని విధంగా అతనిని దుర్భరమైన మరణభయం విచలితం చేసింది. తరువాత కాలంలో ఆయనే దానినీ విధంగా వర్ణించారు.


''నేను మధురైకి శాశ్వత వీడ్కోలు పలుకడానికి ఆరువారాల ముందు నా జీవితానికెల్లా గొప్ప మార్పు సంఘటించింది. అది జరిగింది చాలా అనూహ్యంగా, హఠాత్తుగా. మా పినతండ్రి గారింటి మేడపై గదిలో ఒక్కణ్ణీ కూచున్నాను.మామూలుగానే నాకు అనారోగ్యం అరుదు; ఇక ఆవేళ నేను ఏతేడా లేకుండా, నిక్షేపంలా ఉన్నాననే చెప్పాలి. అయితేనేం, ఓ ప్రచండమైన మరణభయం ఒక్కసారిగా నన్ను ముంచెత్తింది. ఇక, నాలోని ఏ అస్వస్థతను దానికి కారణంగా చెప్పను? దాన్ని వివరించాలని గానీ, కారణం అన్వేషించాలని గానీ నాకప్పుడు లేదు. తోచింది ఒక్కటే – ”నేను చనిపోతున్నాను”, ఇపుడేం చేయాలి. ఓ డాక్టరును సంప్రదించాలని గానీ, పెద్దలకో స్నేహితులకో చెప్పుకోవాలని గానీ తోచలేదు. ఆ సంకటాన్ని నా అంతట నేను, స్వయంగా, పరిష్కరించు కోవాలనుకున్నాను – అప్పుడే, అక్కడే!

మరణభయ తీవ్రతతో మనసులోనికి మునిగి అంతర్ముఖం కాగా నాలో నేనే ఇలా తర్కించుకున్నాను, ప్రత్యేకంగా మాటలతో పనిలేకుండానే:-


సరే చావు వచ్చిపడింది. అంటే? మరణించేదేమిటి? చనిపోయేది శరీరమే కదా’ అంటూ చావు స్థితిని అభినయించాను. వెల్లకిలా పడుకొని చేతులు చాచి కట్టెల్లా బిగించి, సన్నివేశం రసవత్తరమయేలా శవంలాగే తయారయ్యాను. ఊపిరి బిగపట్టాను. ఎటువంటి మాటా, కనీసం నేననే శబ్దం కూడా, పైకి రానట్లుగా పెదవులును బిగించాను. విచారణ కొనసాగించాను. ‘సరే, ఈ దేహం మరణించింది. దీన్ని శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చి బూడిద చేస్తారు. మరి, శరీర మరణంతో ‘నేను’ అంతమైనట్లేనా? శరీరం నేనేనా? అది నిశ్శబ్ద, నిశ్చల జడపదార్థం. మరి ‘నేనో’… నా యొక్క ఎరుకను, స్ఫురణను దేహంతో పనిలేకుండా సంపూర్ణంగా కలిగియున్నాను. అంచేత నేను శరీరానికి అతీతమైన తత్త్వాన్ని. దేహం గతించినా, దానికి భిన్నమైన ఆత్మతత్త్వాన్ని చావు తాకనైనా తాకలేదు. అంటే నేను ‘చావని తత్త్వాన్ని’ అన్నమాట – ఇదంతా ఉత్తుత్తి ఆలోచన కాదు. ఈ సజీవ సత్యం నాలో స్ఫురించగానే ఆలోచనల ప్రసక్తి లేకుండా నేను దానిని సూటిగా గ్రహించాను. ‘నేను’ అనేదే నిజం. నా వర్తమాన ఉనికిని గూర్చిన ఏకైక సత్యం. ఈ ‘నేను’ కేంద్రంగానే శరీరానికి సంబంధించి ఎరుకతో కూడిన కార్యకలాపమంతా సంభవించేది. తత్‌క్షణం నుంచి నేను లేక ఆత్మ ఒక ప్రగాఢమైన ఆకర్షణతో తన దృష్టినంతనూ తన పైనే కేంద్రీకరించింది. చావు భయం సమూలంగా అంతరించిoది. మనసును లోపలే నిలిపి ఉంచే ఆత్మనిష్ఠ అప్పటినుంచి అప్రతిహతంగా, నిర్విరామంగా కొనసాగింది. సంగీతంలోని సప్తస్వరాల్లా ఇతర తలపులు వచ్చిపోవచ్చుగాక, కానీ ఆధార శ్రుతివలె ఈ ‘నేను’ యొక్క ఎరుక స్పష్టం, ప్రస్ఫుటం! శరీరం మాట్లాడటం, చదవడం వంటి ఏ పనుల్లో ఉన్నా ‘నేను’ పైనే ‘నా’ దృష్టి. ఈ సంఘటనకు ముందు ‘నేను’ను గూర్చి నా అవగాహన అంతంత మాత్రం. ఆకర్షణ సుంతైనా లేదు. ఇక దానిని తెలిసికొని నిష్ఠచెందే అవకాశమేదీ?”


ఈ మరణానుభవం వేంకట్రామన్‌ దృక్పథంలోను, నిత్యజీవితంలోను స్పష్టమైన మార్పు తెచ్చింది. అతడు సాధువులా, అణగిమణగి ఉండసాగాడు. పక్షపాత ధోరణిని ఎదిరించేవాడు కాదు. తరువాతి కాలంలో ఆయనే ఇలా వర్ణించారు:


“నాలో సంభవించిన మార్పులలో మీనాక్షీ ఆలయాన్ని గూర్చిన నా ధోరణి ఒకటి. పూర్వం స్నేహితులతో సరదాకో, మొక్కుబడికో వెళ్ళి, దేవీదేవతా మూర్తులను దర్శించి, విభూతి కుంకుమలను ధరించి ఇంటికొచ్చేవాణ్ణి. ఎటువంటి భక్తిభావం లేదు. మరిప్పుడో, ప్రతి సాయంత్రం వెళ్ళేవాణ్ణి – ఒక్కణ్ణీ. శివుడు, మీనాక్షి, నటరాజు లేదా 63 నాయనార్లు – ఏదో ఓ విగ్రహం ముందు నిశ్చలంగా నిలబడి చాలాసేపు ఉండిపోయేవాణ్ణి. భావావేశ తరంగాలు నన్ను ముంచెత్తేవి''

ప్రదక్షిణం అనగా

ప్ర - ప్రదక్షిణం చెయ్యడానికి మీ కాళ్ళు కదులుతూంటే మీ పాపములు పోతాయ్. 
ద - మీరు ఏ కోరికలతో అలమటిస్తున్నారో అవి ఇవ్వబడతాయ్. 
క్షి - మీరు  ఏ కోరికలు లేకుండా ప్రదక్షిణం చేస్తే, జన్మ 
జన్మాంతరములందు చేసిన పాపములు పోతాయ్. 
ణం - ఆఖరి ఉపిరి దగ్గర పాపము లేనటువంటి మోక్ష స్తితిని 
ఇవ్వబడుతుంది. 

తెలుసుకోదగినవి

అసలు ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైనవి మూడే మూడు
ఇంక నాలుగోది ఏమి లేదు.

మనుష్యత్వం - మనుష్యునిగా జన్మించుట
ముముక్షత్వం - నేను మోక్షమును పొందాలనే ఆశ కలిగి ఉండుట.
ఒక వేళ కలిగినా, దారి చూపగలిగేవాడు ఉండాలి. కాబట్టి
మహా పురుష సంశ్రయః  - ఒక మహాపురుషుడితో ఆయనకి కలయిక కలగాలి

ఈ మూడు దుర్లభం, ఈ మూడు అంత సులువుగా దొరికేవి కావు.
ఒక వేళ దొరికితే దేనివలన దొరుకుతాయి, ఈశ్వరానుగ్రహము చేత మాత్రమే, అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఉంటేనే ఇవి సిద్ధిస్తాయి. 

శివాష్టోత్తరం

శివాయ కఠోరాయ జగద్వ్యాపినే
మహేశ్వరాయ త్రిపురాంతకాయ జగద్గురవే
శంభవే వృషాంకాయ వ్యోమకేశాయ
పినాకినే వృషభారూడాయ (40) మహాసేన జనకాయ
శశిశేఖరాయ భస్మోద్ధూళిత విగ్రహాయ చారువిక్రమాయ
వామదేవాయ సామప్రియాయ రుద్రాయ
విరూపాక్షాయ సర్వమయాయ భూతపతయే
కపర్దినే త్రయీమూర్తయే స్థాణవే (80)
నీలలోహితాయ అనీశ్వరాయ అహిర్భుధ్న్యాయ
శంకరాయ(10) సర్వజ్ఞాయ దిగంబరాయ
శూలపాణయే పరమాత్మాయ అష్టమూర్తయే
ఖట్వాంగినే సోమ సుర్యాగ్నిలోచనాయ అనేకాత్మాయ
విష్ణువల్లభాయ హావిషే సాత్త్వికాయ
శిపివిష్టాయ యజ్ఞామయాయ (50) శుద్ధవిగ్రహాయ
అంభికానాథాయ సోమాయ శాశ్వతాయ
శ్రీకంఠాయ పంచవక్త్రాయ ఖండపరశవే
భక్తవత్సలాయ సదాశివాయ అజాయ
భవాయ విశ్వేశ్వరాయ పాశ విమోచకాయ
శర్వాయ వీరభద్రాయ మృడాయ
త్రిలోకేశాయ (20) గణనాథాయ పశుపతయే
శితికంఠాయ ప్రజాపతయే దేవాయ
శివాప్రియాయ హిరణ్య రేతాయ మహాదేవాయ
ఉగ్రాయ దుర్దర్షాయ అవ్యయాయ
కపాలినే గిరిశాయ (60) హరియే
కామారినే గిరీశాయ పూషదంతభేత్రే
అంధకాసుర సూదనాయ అనఘాయ అవ్య గ్రాయ
గంగాధరాయ భుజంగ భూషణాయ దక్షాధ్వర హరాయ
లలాటాక్షాయ భర్గాయ హరాయ (100)
కాలకాలాయ గిరిధన్వినే భగనేత్రభిదే
కృపానిధయే (30) గిరిప్రియాయ అవ్యక్తాయ
భీమాయ కృత్తివాసాయ సహస్రాక్షాయ
పరశుహస్తాయ పురారాతయే సహస్రపాదే
మృగపాణినే  భగవతే అపవర్గ ప్రదాయ
జటాధరాయ ప్రమధాధిపాయ (70) అనంతాయ
కైలాసవాసినే మృత్యుంజయాయ తారకాయ
కవచినే సుక్ష్మతనవే పరమేశ్వరాయ






శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర)

శ్రీ రమ్యంబుగ శ్రీ గిరి యాత్రకు| కూరిమి సతితో కూడి నడచితిని

పల్లెలు పురములు పట్టణంబులు। పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటిది

కంటిని శ్రీగిరి కన్నులనిండా। వింటిని మహిమలు వీనుల నిండా

ఆ మహిమలు నేనేమని చెప్పదు| ఈ మహిలోపల ఎన్నడు చూడము

ధారుణి లోపల అధౌతాచల మది। మేరునికంటెను మిక్కుటమైనది

బ్రహ్మనిర్మల బహి శృంగంబులు। నిర్మలమగు మాణిక్య కూటములు

కోటలు కొమ్మలు గోపురంబులు। తెరపిలేని బహుదేవాలయములు

పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు। వాటమైన పూదోటలు మిక్కిలి

మాటలు నేర్చిన మంచి మృగంబులు। కామధేనువులు కల్పవృక్షములు

క్షేమ కరంబగు చింతామణులు। అమృత గుండంబులు

కడు నైష్ఠికమును కలిగిన విప్రులు। విడువక శంభుని వేడెడి రాజులు

సంతత లింగార్చన గల శైవులు| శాంతులైన వేదాంతులు సిద్ధులు

ఘన ఘన మ్రోగేటి ఘంటనాదములు। విజయ ఘోషయగు శంఖనాదములు

వీర శైవులు వీరాంగంబులు। సాధు బృందములు కామిత భక్తులు అగరు ధూపములు

జపములు చేసేటి జంగమోత్తములు। తపములు చేసెటి తాపసోత్తములు

ప్రమధులు భక్తులు శైవ గణంబులు। గట్టిగ ఇది భూకైలాశం అని

తప్పిపోక పాతాళ గంగలో। తెప్పున తేలుచు తీర్థంబాడుచూ 

చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి। అనువుగా నుదుట విభూతి ధరిస్తిని

పొదుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి

గురు కటాక్షమును గోప్యము చేసితి। గురు మంత్రంబును జపమును చేసితి

అకలంకుడనై ఆశ జయస్తిని

శివ పంచాక్షరి మనసున నిలిపితి। శివ తత్వము పరిశీలన చేసితి

పంచేంద్రియంబులు పదిలము చేసితి। పంచముద్రలభ్యాసము చేసితి

అంతర్ముఖుడనైతిని। నాద బ్రహ్మనాదము వింటిని! లోపల తుమ్మెద నాదము వింటిని

వెలుగులకెల్లా వెలుగై వెలెగెడు। ఆ లోపల దీపము కంటిని

ఇవాళ చంద్రుండావల సూర్యుడు। కలిగిన స్థావరమైన నిదానము కంటిని

కంటికి ఇంపగు పండు వెన్నెల। విరిసిన షట్క మలంబులు షష్ఠలంబులు

పిండాండములో బ్రహ్మాండము కంటిని

అంతట అక్కడ చెంగల్వ కొలనులో। ఆడుచున్న రాచంసను పట్టితి

చాల వేయి స్తంభాల మేడలో। బాలిక కూడుకు కేళి సలిపితిని

మల్లిఖార్జునిని మదిలో దలచితి। ముందర బృంగికి మ్రొక్కి వేడితిని

నం దికేశ్వరుని నమ్మిభజింతిని। చండీశ్వరునకు దండం పెట్టితి

మళ్లీ మళ్లీ మహిమను పొగడుచు। పెళ్ళారయ్యకు ప్రియముగా మ్రొక్కితి

ద్వార పాలకుల దర్శన మాయను। ద్వార మందు రతనాల గద్దెపై

చూచితి నెవ్వరు చూడని లింగం। చూచితి కేవల సుందర లింగం

నిరుపద్రవమగు నిశ్చల లింగం। ఆది తేజమగు ఐక్య లింగం

రాజితమైన విరాజిత లింగం। పూజనీయమగు పురాణలింగం

లింగము గనుకొని లింగ దేహినై। లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని

లింగ మందు మదిలీనము చేసితి। జీవన్ముక్తుడనైతిని

అంక మందు భ్రమరాంబిక ఉండగ। మల్లిఖార్జునిని కోరి పూజింతిని

దీపము పెట్టితి దివ్యదేహునకు। ధూపము వేసితి ధూర్జటి కప్పుడు

తుమ్మిపూలతో పూజిస్తిని। కమ్మని నైవేద్యము పెట్టితి

సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు। జయ జయ జయ జయ జంగా మరాయ

అది దేవుడవు ఆత్మ శరణ్య। దయ తప్పక ధవళ శరీర। భయము బాపు మీభక్త నిదాన

ఎన్ని జన్మములు ఎత్తిన వాడను। నిన్ను తలంపక నీచుడనైతిని

ఎన్నడు ఏ విధమేరుగని వాడను। దుష్ట మానసుడ గౌరీ రమణ

తామస గుణములు తగులాటంబులు। నియమము తప్పిన నీచవర్తనుడ। నిత్య దరిద్రుడ

అత్యాశయుడను అజ్ఞాన పశువును। చేయరాని దుశ్చేష్టలు చేసితి। బాయరాని మీ భక్తుల బాసితి

సంసారంబను సంకెళ్ళలో। హింస పెట్టమిక ఏలుము తండ్రి

ముల్లోకంబులు ముంచెడి గంగను। సలలితముగ జడ దరియిస్తివి

గొప్పచేసి నిను కొలిచిన భంటును। తప్పక చంద్రుని తల దరియిస్తివి

విన్నుని చేతను కన్ను పూజగొని। సన్నుతి కెక్కిన చక్ర మిచ్చితివి

ఆనక శైల కుమారిక కోరిన। సగము శరీరము యిస్తివి

మూడు లోకముల ముఖ్యము నీవే। మూడు మూర్తులకు మూలము నీవే

దాతవు నీవే। భ్రాతవు నీవే। తల్లివి నీవే। తండ్రివి నీవే। బ్రహ్మము నీవే। సర్వము నీవే

పాల ముంచుమిక నీట ముంచుమి। పాల బడితనో ఫాలలోచన

అనుచు ప్రణతుల నిడుచు ఇది చదివిన వారికి॥

ఫలశ్రుతి:


కాలువలు త్రవ్వించి గన్నెర్లు వేసి। పూలు కోసి శివునకు పూజించిన ఫలము
గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి। పాలు తీసి అభిషేకము చేసిన ఫలము
ఆకలితో నున్న అన్నార్తులకును। కమ్మని భోజనం బిచ్చిన ఫలము
భీతితో నున్నట్టి కడు దీనులకును। శరణిచ్చి రక్షించు విశేష ఫలము 
అంతకన్నా ఫలము అధిక మయ్యుండు.

తరతరాలుగా నోటి పాటగా వస్తున్నది ( శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి శివ మహాపురణం ప్రవచనం)

సోమవారం, ఫిబ్రవరి 03, 2014

శివ షోడశోపచార పూజ

(శివునిపై ఉదకము చల్లుచూ, లేక విడుచుచు)

ఓం శూల పాణీయే నమః శివోః హం ప్రతిష్ఠితోభవ.

ధ్యానం:


(పుష్పము చేతపట్టుకొని)

శ్లో // శుద్ధస్పటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం /
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితం //
నీలగ్రీవం శశాంకాంకం – నాగ యజ్ఞోపవీతినం /
వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్య మభయప్రదం //
కమండల్వక్ష సూత్రభ్యామాన్వితం శూలపాణినం /
జ్వలంతం పింగళజటా శిఖాముద్యోత ధారిణిం //
అతృతేనాప్లుతం హృష్టముమాదేహార్ధ ధారిణం /
దివ్యసింహాసనాసీనం – దివ్య భోగ సమన్వితం //
దిగ్దేవతా సమాయుక్తం – సురా సుర నమస్కృతం /
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం
సర్వవ్యాపిన మీశానమేవం వై విశ్వరూపిణం //
(పుష్పమును స్వామిపై నుంచవలయును. అనంతరము ఆవాహనమును చెప్పవలయును. నమకము నందలి 23 వ మంత్రము)

ఆవాహనం:


(మం) మానోమహన్తముతమానో అర్భకం మాన ఉక్షన్తముత మాన ఉక్షితమ్ /
మానోవధీః పితరం మోతం మాతరం ప్రియమాన్తనస్త నువోః // రుద్రదీరిష //
ఓం శివాయనమః ఆవాహయామి /
(పుష్పము నుంచవలయును. తరువాత నమకము నందలి యాతే రుద్రయను ప్రథము మంత్రముచే పుష్పాసనము సమర్పించవలయును.).

ఆసనం:


(మం) యాతేరుద్ర శివాతనూరఘోరా పాపకాశినీ //
తయానస్తనువాశంతమయా గిరీశన్తాభిచాకశీహి //
ఓం మహేశ్వరాయ నమః పుష్పం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)

పాద్యం:


(మం) యామిషుం గిరిశన్త హస్తే భిభిర్ష్యస్తవే
శివాం గిరిత్రతాంకురు మహిగం సీః పురుషంజగత్
ఓం శంభవే నమః పాద్యం సమర్పయామి.
(ఉదకమును విడవవలెను.)

అర్ఘ్యం:


(మం) శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి /
యదానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనాఅసత్ //
ఓం భర్గాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

ఆచమనం:


(మం) అధ్య వోచద ధివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్ /
అహంగ్ హీశ్చ సర్వానమ్భజస్సర్వాశ్చ యాతుధాయన్య
ఓం శంకరాయ నమః ఆచమనీయం సమర్పయామి.
(ఉదకమును విడువవలెను.)

స్నానం :


(మం) అసౌ యస్తామ్రౌ అరుణ ఉతబభ్రుసుమంగళః
యే చేమాగం రుద్రా అభితోదిక్షు //
శ్రితాస్సహస్ర శోవై షాగం హేడ ఈమహే //
ఓం శాశ్వతాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

పంచామృతస్నానం


ఆప్యాయస్వమేతుతే విశ్వతస్సోమవృష్టియం /
భవా వాజస్య సంగధేః //
ఓం పశుపతయే నమః క్షీరేణ స్నాపయామి .
(స్వామికి పాలతో స్నానము చేయవలెను)

ధదిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరస్వశ్యవాజినః /
సురభినో ముఖాకరత్ప్రమణ అయుగంషితారిషత్ //
ఓం ఉమాపతయే నమః దధ్యాస్నాపయామి .
(స్వామికి పెరుగుతో స్నానము చేయవలెను)

శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవేవస్సవితోత్సునా
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్యరస్మిభిః //
ఓం పరబ్రహ్మణే నమః అజ్యేన్న స్నాపయామి.
(స్వామికి నెయ్యితో స్నానము చేయవలెను)

మధువాకా యతాయుతే మధుక్షరంతి సింధవః
మాధ్వీన్నస్సంత్వౌషమాధీః / మధునక్తముతోషినీ //
మధువత్పార్ధిగం రజః మధుదౌరస్తునః స్థితాః /
మధుమాన్నో వనస్పతిర్మధురాగం (అస్తు) సూర్యః
మాధ్వీర్గావో భవంతునః //
ఓం బ్రహ్మాధిపాయనమః / మధునా పపయామి
(స్వామికి తేనెతో స్నానము చేయవలెను)

స్వాధుః సవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ
సహనేతునామ్నే ! స్వాదుర్మిత్రాయ వరుణాయ
వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః /
ఓం పరమేశ్వరాయ నమః! శర్కరాన్ స్నపయామి.
(స్వామికి పంచదారతో స్నానము చేయవలెను)

యాః ఫలవీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రమాతోస్తానో ముస్త్వగ్ హంసః //
ఓం ఫాలలోచనాయ నమః – ఫలోదకేన స్నాపయామి
(స్వామికి కొబ్బరినీళ్ళుతో స్నానము చేయవలెను)

(తతః నమకచమకపురుషసూక్తేన శుద్ధోదకస్నానం కుర్యాత్)
అపోహిష్టామయోభువః – తాన ఊర్జేదధాతన /
మహేరణాయ చక్షసే యోవశ్శివ తమోరసః /
తస్మా అరంగ మామవః యస్యక్షయాయ జిన్వధ //
అపోజన యధాచనః
ఓం అష్టమూర్తయే నమః – శుద్ధోదకస్నానం సమర్పయామి.
(స్వామికి నీళ్ళుతో స్నానము చేయవలెను)

అభిషేకము:


(క్రింది మంత్రములను చదువుచు జలధార విడువవలయును)

ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముత తే నమః //
తయాన స్తనువాశం తమయా గిరిశన్తాభి చాకశీహి /
యామిషుం గిరిశన్త హస్తే భిభిర్ష్యస్తవే
శివాం గిరిత్రతాంకురు మహిగం సీః పురుషంజగత్ //
శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి /
యదానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనా అసత్ //
అధ్య వోచద ధివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్ /
అహంగ్ హీశ్చ సర్వానమ్భజస్సర్వాశ్చ యాతుధాయన్యః //
అసౌ యస్తామ్రౌ అరుణ ఉతబభ్రుసుమంగళః
యే చేమాగం రుద్రా అభితోదిక్షుః //
శ్రితాస్సహస్ర శోవై షాగం హేడ ఈమహే
అసౌయో పరస్పతిః నీలగ్రివో విలోహితః
ఉత్తైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః
ఉత్తైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః //
నమోఅస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే /
అథోయే అస్య సత్వానో హం తేభ్యో కరం నమః
ప్రముంచ ధన్వన స్వముభయోరార్న్తి యోర్జ్యామ్
యశ్చతే హస్త ఇషవః పరాతా భగవోవ ప
అవతత్యదనుస్ట్వగం సహస్రాక్ష శతషుధే //
నిశీర శల్యానాం ముఖాశివో నస్సుమానాభవ //
విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగం ఉత //
అనేశన్న స్యేషవ అభురస్య నిషంగధిః //
యాతే హేతిర్మీఢుష్టమ హస్తేబభూవతే ధనుః
తయా స్మానిశ్వత స్త్వమయక్ష్మ యా పరిభుజ //
నమస్తే అస్త్యాయుధాయాతా నాత య ధృష్ణవే
ఉభాభ్యాముత నమో బాహుభ్యా తవ ధన్వనేః
పరితే ధన్వనోహేతిరస్మాన్మృణక్తు విశ్వతః
అథోధియ ఇషు స్తవా రే అస్మిన్న దేహితమ్ //
మానో మహాన్త ముతమానో అర్భకం మాన ఉక్షన్త
ముతమాన ఉక్షీతమ్ / మానో వధీః పితరం మోతమాతరం
ప్రియామానస్తనువోః రుద్రరీరిషః //
మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో
అశ్వేషిరీరిషః వీరాజన్మానో రుద్రభామితో వఢఃఇర్హవిష్మన్తో నసుసావిధేమ తే //
అణోరణీయా మహమేవకత్వం మహానహం విశ్వ మదం వచైత్రం
పురాతనోహం పురుషోహమీశో హిరణ్యయోహం శిరూప మస్తి //
ఓం మృత్యుంజయాయ నమః అభిషేకం సమర్పయామి.

వస్త్రం:


(మం) అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్నదృశన్ను దహార్యః
ఉతైనం విశ్వభూతానిసః దృష్టో మృడయాతినః
ఓం మృడాయ నమః – వస్త్రయుగ్మం సమర్పయామి.

కటిబంధనము:


(మం) దీర్ఘాయుత్వాయజదృష్టిరస్మితం జీవామివరదః
పురూచరాయ సోషమభిసంవ్య యిష్యే /
ఓం భూతేశాయ నమః కటిబంధేనవస్త్రం సమర్పయామి.

భస్మదారణం:


(మం) అగ్నిరితభస్మ వాయురిత భస్మజమితి
భస్మస్థలమితి భస్మ వ్యోమేతిభస్మ సర్వగం హవాయ ఇదగం సర్వంభస్మ /
(మం) త్ర్యంబకం యజామహే ఉగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివబంధనాన్మృత్యోరుక్షీయమా మృతాత్ /
ఓం శర్వాయ నమః ఇతి భస్మధారణం.

యజ్ఞోపవీతం:


(మం) యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ /
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః //
ఓం సర్వేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:


(మం) యోవైరుద్రవః యశ్చసోమో భూర్భువ
సువస్తస్మై నమోనమశ్శీర్ షంజనదోం విశ్వరూపోసి
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీశిణీం
ఈశ్వరీగం సర్వభూతానాంత్వామిహోపహ్వయేశ్రియం
ఓం సర్వజ్ఞాయ నమః గంధం విలేపయామి.
(గంధం చల్లవలెను.)

అక్షతలు


(మం) ఆయనే తే పరాయణే దూర్వారోహస్తు పుష్పిణః
హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాణమే //
ఓం సదాశివాయ నమః అక్షతాన్ సమర్పయామి.
(అక్షతలు సమర్పించవలెను)

బిల్వపత్రం:


(మం) యావై రుద్రస్య భగవాన్యశ్చ సూర్యోభూర్భువ
సువస్తస్మైవై జనమోనమశ్శీర్ షంజనదో విశ్వరూపోసి //
శ్లో // అమృతోద్భవ శ్రీవృక్షం శంకరస్య సదాప్రియా /
తత్తేశంభో ప్రయచ్ఛామి బిల్వపత్రం సురేశ్వర //
త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలై శుభైః /
తవపూజాం కరిష్యామి అర్చయేత్పరమేశ్వరః //
గృహాణ బిల్వపత్రాణి సుపుష్పాణి మహేశ్వరః /
సుగంధేన భవానీశ హివత్త్వం కుసుమప్రియః //
ఓం అభయాయ నమః బిల్వపత్రాణి సమర్పయామి.
(బిల్వపత్రములు వేయవలెను)
(అనంతరం అష్టోత్తరశతనామైర్వాత్రిశతనామైర్వా సహస్ర నామైర్వాప్రపూజయేత్)

అథాంగపూజ:


ఓం శంకరాయ నమః – పాదౌ పూజయామి.
ఓం శివాయ నమః – జంఘే పూజయామి.
ఓం మహేశ్వరాయ నమః – జానునీ పూజయామి.
ఓం త్రిలోకేశాయ నమః – ఊరుం పూజయామి.
ఓం వృషాభారూఢాయ నమః – గుహ్యం పూజయామి.
ఓం భస్మోద్ధోళిత విగ్రయా నమః – కటిం పూజయామి.
ఓం మృత్యుంజయాయ నమః – నాభిం పూజయామి.
ఓం రుద్రాయ నమః – ఉదరం పూజయామి.
ఓం సాంబాయ నమః – హృదయం పూజయామి.
ఓం భుజంగభూషణాయ నమః – హస్తౌ పూజయామి.
ఓం సదాశివాయ నమః – భుజౌ పూజయామి.
ఓం విశ్వేశ్వరాయ నమః – కంఠం పూజయామి.
ఓం గిరీశాయ నమః – ముఖం పూజయామి.
ఓం త్రిపురాంతకాయ నమః – నేత్రాణి పూజయామి.
ఓం విరూపాక్షాయ నమః – లలాటం పూజయామి.
ఓం గంగాధరాయ నమః – శిరః పూజయామి.
ఓం జటాధరాయ నమః – మౌళీం పూజయామి.
ఓం పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి.
ఓం పరమేశ్వరాయ నమః – పూజయామి.

లింగపూజ:


ఓం నిధనపతయే నమః
ఓం నిధనపతాంతికయై నమః
ఓం ఊర్ధ్వాయ నమః
ఓం హిరణ్యాయ నమః
ఓం సువర్ణాయ నమః
ఓందివ్యాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శివాయ నమః
ఓం జ్వలాయ నమః
ఓం ఆత్మాయ నమః
ఓం పరమాయ నమః
ఓం ఊర్థ్వలింగాయ నమః
ఓం హిరణ్యలింగాయ నమః
ఓం సువర్ణలింగాయ నమః
ఓం దివ్యలింగాయ నమః
ఓం భవలింగాయ నమః
ఓం శర్వలింగాయ నమః
ఓం శివలింగాయ నమః
ఓం జ్వలలింగాయ నమః
ఓం ఆత్మలింగాయ నమః
ఓం పరమలింగాయ నమః

ధూపం:


నవవస్త్వా ధూపయంతు / గాయత్రే ఛందసాంగి -
రస్వద్ద్రుద్రాస్త్వా భూపయంతు / త్రెష్టుభేన ఛందసాంగి
రస్వదాదితాస్త్వా ధూపయంతు / జగతేన ఛందసాంగి
రస్వదిఁ బ్రస్త్వా ధూపయత్వం / గిరిస్వదివ్వష్ణుస్త్వా ధూపయర్వంగిరస్వ /
వ్వరుణత్వా ధూపయత్వం గిరిస్వదదలిప్తా దేవీర్విశ్వ దేవ్యాపతీ /
పృధీవ్యాసృభస్థేంగిదసర్దనత్యనట దేవానాం త్వాపత్నీ /
ఓం భీమాయ నమః – ధూపమాఘ్రాపయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

దీపం:


ఆపాణి పాదోహ మంచిత్తపశ్శ్క్తిం, పశ్వామ్య చక్షుస్స
శృణోన్యుకర్ణః సవేత్తివేద్యం నదతపాప్తి, వేత్తాత మహురగ్ర్యం పురుషం మహంతం
సర్వవ్యాపిన మాత్మానం క్షీరే సర్పి శివార్పితంసా
ఆత్మవిద్యా తపోమూలం త్ద్బ్రహ్మోపవిషదమ్ //
నతత్ర సూర్యోభాతినః చంద్రతారకం
నేమావిద్యుతో భాంతికురో యమగ్ని తస్యభాసా సర్వమిదమ్ విభాతి //
ఓం మహాదేవాయ నమః దీపం దర్శయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

నైవేద్యం:


(మం) దేవసవితః ప్రసువసత్యంత్వర్తేన పరిషంచామి
అమృతమస్తు అమృతోప స్తరణమసి స్వాహా //
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,
(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రఃప్రచోదయాత్
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:


(మం) ఉమారుద్రాయ తవసే కపర్థినేక్షయద్వీరాయ
ప్రభరామహమతిం / య్ధావశ్శమ అద్విపదే
చతుష్పదే విశ్వం పుష్టంగ్రామే అస్మిన్న నాతురమ్ //
ఓం త్రిపురాంతకాయ నమః తాంబూలం సమర్పయామి.
తాంబూలం చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

నీరాజనం:


శ్లో // పరానంద చిదాకాశ – పరబ్రహ్మ స్వరూపికా /
నీరాజనం గృహాణేశ – ఆనందాఖ్యం సదాశివ //
(మం) అర్యప్రజామే గోపాయ – సర్వప్రజామే గోపాయ – అమృతత్త్వాయ జీవసే జనిష్యమాణాంచ / అమృతేసత్యే ప్రతిష్టితామ్ అధర్వపితుంమే గోపాయ రసమన్న మిహాయుషే అదబ్దాయో శీతతనో అవిషన్న పితుంకృణుః స్వపశూన్మే గోపాయః ద్విపాదో యే చతుష్పదః అష్టాశ పాశ్చాయ ఇహగ్నే / యేచైక్ శపా అనుగాః సప్రధస్సభాంమే గోపాయ యేచక్యాస్సభాసదః తానింద్రియావతః కురుసర్వమయూరు పానతామ్ హేర్భుద్ని య మంత్రం మే గోపాయ యమృషయస్రై విదావిదుః // ఋచుస్సామాని యజూగంషిపాహి శ్రీరమృతానతామ్ / మానో వాగంసీ జాతవేదోగామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న గహిశ్రియా మా పరిపాలయా సామ్రాజ్యం చ విరాజం చాభి శ్రీర్యాచనో గృహలక్ష్మీ రాష్ట్రస్యయ ముఖేతయా మానగం సృజామసినం తత శ్రీరస్తుః నిత్యమంగళాని భవంతు.
ఓం సదాశివాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి.
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
అనంతరం ఆచమనీయం సమర్పయామి.

మంత్రపుష్పమ్:


ఓం సహస్ర శీర్ షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం.
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం.
విశ్వమేవేదం పురుషస్త ద్విశ్వముఅపజీవతి,
పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం,
నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః,
నారాయణ పరంబ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
యచ్చకించిజ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతే పివా,
అంతర్బహిశ్చ త త్సర్యం వ్యాప్య నారాయణ స్స్థితః
అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం
పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం,
అధోనిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్ఠతి,
జ్వాలామాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్,
సన్తతగం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం.
తస్యాన్తే సుషిరగం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠతం,
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః.
సోగ్రభు గ్విభజ న్తిష్ఠ న్నాహార మజరః కవిః
తిర్యగూర్థ్వ మధశ్శాయీ రశ్శయస్తస్య సంతతా,
సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తగః,
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః,
నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ త్తన్వీ పీతా భాస్వత్యణూపమా,
తస్య శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,
స బ్రహ్మ స శివ స్స హరిస్సేంద్ర స్సోక్షరః పరమః స్వరాట్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వై శ్రవణాయ కుర్మహే
స మే కామా న్కామకామాయ మహ్యం
కామేశ్వరోవైశ్రవణో దదాతు.
కుబేరాయవైశ్రవణాయ, మహారాజాయ నమః
ఓం తద్బ్రహ్మ – ఓం తద్వాయుః ఓం తదాత్మా
ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః.
అన్తశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కాస్త్వ మింద్రస్తగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః / త్వం తదాప ఆపోజ్యోతి రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ //
(ఈశాన్యస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మధిపతిర్బ్రహ్మణీధిపతిర్బ్రశివోమే అస్త్సదా శివోం
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ //
( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ఆత్మప్రదక్షిణ


(కుడివైపుగా 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేయవలెను)

యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః,
త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల.
శ్రీ సదాశివాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

అర్పణం::


శ్లో // యస్యస్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందేతమీశ్వరం //
మంత్రహీనం క్రియాహీనమ్ భక్తహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే //
సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు
శ్రీ సదాశివ ప్రసాదం శిరసా గృహ్ణామి //
(పుష్పాదులు శిరస్సున ధరించవలెను.)

తీర్థస్వీకరణం:


శ్లో // అకాలమృత్యుహరణం – సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం – శివపాదోదకం పావనం శుభం //
(అనుచు స్వామి పాద తీర్థమును పుచ్చుకొనవలెను.)

శుభం భూయాత్ ..

పూజా విధానము సంపూర్ణం.

శనివారం, ఫిబ్రవరి 01, 2014

నిత్య పూజా విధానం

యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో, 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని, భక్తిగా భగవంతుడిని తలచుకున్నా, పూజ చేసుకున్నా మనజన్మకు సార్థకత లభిస్తుంది.

       ప్రతీ ఒక్కరు ఇంట్లో పూజ చేసుకుంటారు. దేవుడి మహిమనో ఏమో కానీ ఈ మధ్య నాస్తికులు కూడా దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. మరి రోజూ ఇంట్లో పూజ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా!! 

{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}

వినాయకుని శ్లోకం

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం 
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
***
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః 
{అని నమఃస్కారం చేసుకోవాలి}

******
శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
***

పవిత్రము


శ్లో||      అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం | సభాహ్యా అభ్యంతర శుచిః ||
పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః  ||

{ పంచపాత్రలోని నీటిని ఉద్దరిణితో తీసుకుని బొటన వేలితో 3సార్లు తలపై చల్లుకోవాలి }
******

అనంతరం ఏకాహారతి వెలిగించాలి


{ ఏకాహారతి వెలిగించి దానికి గంధం, పసుపు, కుంకుమ అలంకరించాలి }

దీపారాధన 

{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి వెలిగించాలి అంతే కానీ దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు}

శ్లో||  దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే ||

ఇతి దీపదేవతాభ్యో నమః

{దీపానికి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించాలి. ఆడవారు 5వత్తులు, మగవారు 3వత్తులు, హీనపక్షంలో కనీసం 2వత్తులు వెలిగించాలి}

[ ఓ దీప దైవమా! నీవు బ్రహ్మస్వరూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి, మా కోర్కెలన్నింటినీ తీర్చుమా అని అర్ధం ]


******
(దీపం వెలిగించి గంటను వాయిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను)

ఘంటా నాదము


శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||

[అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది]

******

ఆచమనం

( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)

ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా  --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
{ చెయ్యి కడుగుకోవాలి}
ఓం గోవిందాయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}

కేశవనామాలు

ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః 
 ఓం శ్రీకృష్ణాయ నమః
 ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః  --- ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)

******

భూశుద్ధి

{ఆచమానంతరం  - భూశుద్ధి కై భూతోచ్చాటన మంత్రము చదువుతూ  కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవలెను}

శ్లో||   ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

******

ప్రాణాయామం

శ్లో||  ఓం భూ: |  ఓం భువః | ఓం సువః ఓం మహః | ఓం జనః ఓం తపః ఓం సత్యం |
 ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }

******

సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం 
(కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా)
శుభే శోభనే ముహూర్తే
 ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః
 (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు)
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే - భరతఖండే
(India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి)
మేరోః దక్షిణ దిగ్భాగే
శ్రీశైలస్య____ (ఈశాన్య/వాయువ్య/... ) ప్రదేశే
(కృష్ణా / గంగా / గోదావర్యోః) మధ్యదేశే  (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి)
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) ____నదీసమీపే
నివాసిత గృహే (సొంత ఇల్లు అయితే "సొంత గృహే"అని చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన 
శ్రీ____నామ సంవత్సరే
ఉత్తరాయనే  / దక్షిణాయనే 
______ఋతవే ( 'గ్రీష్మ' - ఎండాకాలం / 'వర్ష' - వర్షాకాలం / 'వసంత' - చలికాలం
______మాసే (తెలుగు నెలలు  చైత్రం, వైశాఖం...)
______పక్షే  (శుక్ల పక్షం -- చంద్రుడు పెరుగుతుంటే  / కృష్ణ పక్షం -- చంద్రుడు తరుగుతుంటే)
______ తిధౌ (ఉదయం ఏ తిథి ప్రారంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి, విదియ... )
______ వాసరే (ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి. ఆది, సోమ...)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రః (గోత్రం)
అహం __________ నామ ధేయస్య (పేరు) 
ధర్మ పత్ని ______________ నామ ధేవతి (పేరు)
సఃకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}

నిర్విఘ్నేన  పూజా పరిసమాప్త్యర్ధం మహా గణాధి పతయే నమః

శ్రీ గురుభ్యో నమః 

******

కలశారాధన

తదంగ కలశారాధనం కరిష్యే
{మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను. కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేతితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను}

శ్లో||  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ||

గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి | 
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ||

ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః

కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై  చల్లాలి)

ఆత్మానాం సంప్రోక్ష్య (మన పైన)

పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యాల పైన చల్లాలి)

******

షోడశోపచార పూజ 

1) ఓం శివాయ నమః --- ధ్యానం సమర్పయామి 
2) ఓం పరమేశ్వరాయ నమః --- ఆవాహయామి
3) ఓం కైలాసవాసాయ నమః --- సింహాసనం సమర్పయామి
(సింహాసనార్ధం అక్షతాన్ సమర్పయామి)
4) ఓం గౌరీనాధాయ నమః --- పాదయో: పాద్యం సమర్పయామి
5) ఓం లోకేశ్వరాయ నమః --- హస్తయో: అర్ఘ్యం సమర్పయామి
6) ఓం వామదేవాయ నమః --- ముఖే ఆచమనీయం సమర్పయామి
7) ఓం రుద్రాయ నమః --- మధుపర్కం సమర్పయామి
8) ఓం వృషభవాహనాయ నమః --- పంచామృత స్నానం సమర్పయామి 
పంచామృత స్నానానంతరం శుద్దోదక స్నానం సమర్పయామి
9) ఓం దిగంబరాయ నమః --- వస్త్రయుగ్మం సమర్పయామి 
10) ఓం జగన్నాధాయ నమః --- యజ్ఞోపవీతం సమర్పయామి
11) ఓం భవాయ నమః --- ఆభరణం సమర్పయామి
(ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి)
12) ఓం కపాలధారిణే నమః --- గంధం సమర్పయామి
13) ఓం మహేశ్వరాయ నమః --- అక్షతాన్  సమర్పయామి
14) ఓం సంపూర్ణగుణాయ నమః --- పుష్పం సమర్పయామి

సూచన
* అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు స్వామికి చూపించి వేరొక పాత్ర లో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పళ్ళెము) లో వదలరాదు.
* మధుపర్కం సమర్పయామి అనగా స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని అర్ధం. ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు)
 * వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును. ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
* ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
******

అథాంగ పూజ

ఓం శంకరాయ నమః – పాదౌ పూజయామి
ఓం శివాయ నమః – జంఘే పూజయామి (పిక్కలు)
ఓం మహేశ్వరాయ నమః – జానునీ పూజయామి (మోకాళ్ళు)
ఓం త్రిలోకేశాయ నమః – ఊరుం పూజయామి (తొడలు)
ఓం వృషాభారూఢాయ నమః – గుహ్యం పూజయామి
ఓం భస్మోద్ధోళిత విగ్రయా నమః – కటిం పూజయామి(నడుము)
ఓం మృత్యుంజయాయ నమః – నాభిం పూజయామి
ఓం రుద్రాయ నమః – ఉదరం పూజయామి
ఓం సాంబాయ నమః – హృదయం పూజయామి
ఓం భుజంగభూషణాయ నమః – హస్తౌ పూజయామి
ఓం సదాశివాయ నమః – భుజౌ పూజయామి
ఓం విశ్వేశ్వరాయ నమః – కంఠం పూజయామి
ఓం గిరీశాయ నమః – ముఖం పూజయామి
ఓం త్రిపురాంతకాయ నమః – నేత్రాణి పూజయామి
ఓం విరూపాక్షాయ నమః – లలాటం పూజయామి
ఓం గంగాధరాయ నమః – శిరః పూజయామి
ఓం జటాధరాయ నమః – మౌళీం పూజయామి
ఓం పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి

******

అష్టోత్తర శతనామపూజ 


******
15) ఓం పార్వతీనాధాయ నమః ---  ధూపమాఘ్రాపయామి

16) ఓం తేజోరూపాయ నమః --- దీపం దర్శయామి

******

నైవేద్యం

 (నివేదన పదార్ధములపై నీరు చిలుకుచూ)
శ్లో||  ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం |
భర్గోదేవస్య ధీమహి - ధీయోయోనః ప్రచోదయాత్ ||

(క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో తిప్పాలి) 

(నైవేద్యం పగలు సమయంలో పెడితే)
 ఓం స్వత్యంత్వర్తేన పరిషించామి

(నైవేద్యం రాత్రి సమయంలో పెడితే)
ఋతంత్వా సత్యేన పరిషించామి 

(పుష్పంతో నైవేద్యంపై జలం ఉంచి)
అమృతమస్తు 

(అదే జలపుష్పాన్ని దేవుని వద్ద ఉంచి)
అమృతోపస్తరణమసి

ఓం లోకరక్షకాయ నమః --- నైవేద్యం సమర్పయామి

(5సార్లు దేవునికి నైవేద్యం చూపిస్తూ)
ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా -
 ఓం వ్యానాయ స్వాహా - ఓం ఉదానాయ స్వాహా -
 ఓం సమానాయ స్వాహా

(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన  5సార్లు చల్లాలి)
 మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి 
శుధ్ధాచమనీయం సమర్పయామి

******

తాంబూలం

ఓం కాలాయ నమః --- తాంబూలం సమర్పయామి

 {తాంబూలమును (మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి}

తాంబూల చరవణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి

(తాంబూలం వేసుకున్నాక  నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి)

******

నీరాజనం

(కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన ఏకాహారతి దీపంతో వెలిగించాలి)
ఓం త్రిలోచనాయ నమః --- కర్పూర నీరాజనం సమర్పయామి

కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
(నీరు హారతి కుంది చివర వదలాలి)

******

మంత్రపుష్పం

(మంత్రపుష్పమునకు అక్షతలు, పుష్పములు తీసుకొని విడువవలయును)

శ్లో||  ఓం పురుషస్య విద్మహే మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్


ఓం శంకరాయ నమః --- సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

******

ప్రదక్షిణ నమస్కారం

(అక్షతలు, పుష్పము తీసుకొని ప్రదక్షిణము చేయ వలయును)

శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ | 

తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే |

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః 
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా ||

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా |

ఓం భవాయ నమః --- ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి


******

సాష్టాంగ ప్రణామం

(మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి)

శ్లో|| ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా |

పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే || 

******

క్షమాప్రార్థన 

ఆ తరవాత మళ్లీ కూర్చుని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి)

శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరః
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే

అనయా ధ్యానావాహనాది షోడషోపచార పూజయాచ అష్టోత్తర నామార్చనాయచ మహా నివేదనాయచ భగవాన్‌ సర్వాత్మకః సర్వం శ్రీమహేశ్వర దేవతార్పణమస్తు

శ్రీ మహేశ్వర దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు

ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
(అంటూ అక్షతలనూ నీటినీ పళ్ళెంలో వదలాలి)

శ్లో|| ఉపచారాపదేశేన కృతాన్ అహర్ అహర్మయా |
అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ ||

ఓం మహేశ్వరాయ నమః - అపరాధ నమస్కారాన్ సమర్పయామి

శ్రీ పరమేశ్వర  ప్రసాదం శిరసా గృహ్ణామి

(పూజాక్షతలు శిరసున ధరించాలి)

******

విశేషోపచారములు


ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి
(నమస్కరించి అక్షతలు వేయాలి)

******

తీర్ధం


శ్లో|| అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |

      సమస్త పాపక్షయకరం శ్రీపరమేశ్వర పాదోదకం పావనం శుభమ్ ||

      (తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను. ప్రసాదం స్వీకరించాలి)


******

ఉద్వాసన 


ఓం పరమేశ్వరాయ నమః ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ

 (అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇంట్లో చేసుకునే నిత్య పూజకు ఉద్వాసన చెప్పాల్సిన అవసరం లేదు)


******
శుభం భూయాత్...
పూజా విధానము సంపూర్ణం