మంగళవారం, ఫిబ్రవరి 16, 2016

అన్నపూర్ణా స్తోత్రం - తాత్పర్య సహితం

नित्यानन्दकरी वराभयकरी सौंदर्यरत्नाकरी
निर्धूताखिल-घोरपापनिकरी प्रत्यक्षमाहेश्वरी।
प्रालेयाचल-वंशपावनकरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपुर्णेश्वरी॥१॥
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 1 ||
తాత్పర్యం: నిత్యమైన ఆనందము యిచ్చేదానవు, వరములను - అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘోరమైన పాపములనన్నిటినీ కడిగి వేయుదానవు, నీ ఉనికిని ప్రత్యక్షంగా తెలియచేసేదానివి, హిమవంతుని వంశమును పవిత్రము చేసినదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము. 

नानारत्न-विचित्र-भूषणकरी हेमाम्बराडम्बरी
मुक्ताहारविडम्बमानविलसद्वक्षोजकुम्भान्तरी।
काश्मीरागरुवासिताङ्गरुचिरा काशीपुराधीश्वरी।
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी॥२॥
నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ |
కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 2 ||
తాత్పర్యం: వివిధ రత్నములతో కూడిన విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వెదజల్లు శరీరము కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी
चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी ।
सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी॥३॥
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 3 ||
తాత్పర్యం: యొగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మ-అర్ధ నిష్ఠలను ఏర్పరచుదానవు, చంద్రుడు - సూర్యుడు - అగ్నులతో సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు, సమస్త కోరికలను తీర్చుదానావు , కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

कैलासाचल-कन्दरालयकरी गौरी उमा शाङ्करी
कौमारी निगमार्थगोचरकरी ओंकारबीजाक्षरी।
मोक्षद्वार-कवाट-पाटनकरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी॥४॥
కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 4 ||
తాత్పర్యం: కైలాస పర్వత గుహయందుడు దానవు, గౌరవర్ణం (బంగారు రంగు) కలిగిన దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును బోధించు దానవు, ఓంకార బీజాక్షరస్వరూపము కలదానవు, మోక్షద్వారపు తలుపులను తెరచెడి దానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

दृश्याऽदृश्य-विभूतिवाहनकरी ब्रह्माण्डभाण्डोदरी
लीलानाटकसूत्रखेलनकरी विज्ञानदीपांकुरी।
श्री विश्वेशमनः प्रसादनकरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी॥५॥
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 5 ||
తాత్పర్యం: కనబడీ కనబడని మహిమలు కలదానవు, ఉదరమునందు బ్రహ్మాండములను మోయుచున్నదానవు, లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానమనే దీపమును వెలిగించుదానవు, పరమేశ్వరుని ఆనందింపచేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

उर्वी सर्वजनेश्वरी भगवती माताऽन्नपूर्णेश्वरी
वेणीनील-समान-कुन्तलधरी नित्यान्नदानेश्वरी।
साक्षान्मोक्षकरि सदाशुभकरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी॥६॥
ఉర్వీసర్వజనేశ్వరీ భగవతీ మాతాన్నపూర్ణేశ్వరీ 
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 6 ||
తాత్పర్యం: భూమియందలి సమస్తజనులకు నాయకురాలవు, దేవతవు, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి, దయాసముద్రమైనదానవు, స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మోక్షమునిచ్చుదానవు, ఎల్లప్పుడు శుభము కలిగించు దానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

आदिक्षान्त-समस्तवर्णनकरी शम्भोस्त्रिभावाकरी
काश्मीरात्रिजलेश्वरी त्रिलहरी नित्यांकुरा शर्वरी।
स्वर्गद्वार-कवाट-पाटनकरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी॥७॥
ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరాత్రిజలేశ్వరీ త్రిలహరీ నిత్యాంకురా శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 7 ||
తాత్పర్యం: 'అ' కారము మొదలు 'క్ష' కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, శంభుని మూడు భావాలను (సృష్టి, స్థితి, లయ) కలిగిన దానివి, ఎర్రని వర్చస్సు (ఇక్కడ కాశ్మీరము అనగా ఎరుపు రంగు) కలదానివి, (ఇచ్చ, జ్ఞానం, క్రియలనే) మూడు ప్రవాహాలు కలదానివి, మూడుకన్నులు కలదానవు, నిత్యం అంకురార్పణ చేయుదానివి(సృష్టి), శర్వరివి, స్వర్గ ద్వారపు తలుపులను తెరచెడి దానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

देवी सर्वविचित्ररत्नरचिता दाक्षायणी सुंदरी
वामे स्वादु पयोधरा-प्रियकरी सौभाग्यमाहेश्वरी।
भक्ताऽभीष्टकरी सदाशुभकरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी॥८॥
దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామే స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 8 ||
తాత్పర్యం: దేవివి, విచిత్రములైన సర్వరత్నములతో అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తెవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కల దానవు, ప్రియమునిచ్చుదానవు, సౌభాగ్యాన్నిచ్చే మహేశ్వరివి, భక్తుల అభీష్టములు (కోర్కెలు) తీర్చుదానివి, సదా శుభాలను కలుగ చేసేదానివి, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

चर्न्द्रार्कानल कोटिकोटिसदृशी चन्द्रांशुबिम्बाधरी
चन्द्रार्काग्नि समान-कुङ्डलधरी चन्द्रार्कवर्णेश्वरी।
माला पुस्तक-पाश-साङ्कुशधरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी॥९॥ 
చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 9 ||
తాత్పర్యం: కొట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నులతొ సమానముగా ప్రకాశించుదానవు, చంద్రబింబము వంటి ముఖము మరియు ఎర్రనైన పెదవులు కలదానవు, చంద్రుడు, సూర్యుడు, అగ్నుల వలె ప్రకాశించు కుండలములు ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి వర్ణము కలదానవు, మాల, పుస్తకము, పాశము,అంకుశము లను నాలుగు చేతులతో ధరించినదానివి, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

क्षत्रत्राणकरी महाऽभयहरी माता कृपासागरी
सर्वानन्दकरी सदा शिवकरी विश्वेश्वरी श्रीधरी।
दक्षाक्रन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी।
भिक्षां देहि कृपावलंबनकरी माताऽन्नपूर्णेश्वरी॥१०॥
క్షత్రత్రాణకరీ మహాఽభయహరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 10 ||
తాత్పర్యం: వీరులను రక్షించుదానవు, మహాభయాలను తొలగించే తల్లివి, దయా సముద్రమైన దానవు, అందరికీ ఆనందము కల్గించు దానవు, ఎల్లప్పుడు శుభము కల్గించు దానవు, విశ్వమునకు రాణివి, శోభిల్లు దానవు, దక్షప్రజాపతికి (యాగనాశనము ద్వారా) దుఃఖమును కలిగించినదానివి, సుఖము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.

अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ॥११॥
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || 11 ||
తాత్పర్యం: ఓ అన్నపూర్ణా| ఎల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి! శంకరుని ప్రాణవల్లభురాలా! పార్వతీ! జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్షపెట్టుము.

माता च पार्वती देवी पिता देवो महेश्वरः ।
बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥१२॥
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||
తాత్పర్యం: తల్లి పార్వతీ దేవి, తండ్రి పరమేశ్వరుడు, బంధువులు శివభక్తులు, మూడులోకములు స్వదేశము!
॥ इति श्रीमच्छंकराचार्यविरचितम्‌ अन्नपूर्णास्तोत्रं सम्पूर्णम्‌ ॥