శనివారం, ఫిబ్రవరి 01, 2014

నిత్య పూజా విధానం

యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో, 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని, భక్తిగా భగవంతుడిని తలచుకున్నా, పూజ చేసుకున్నా మనజన్మకు సార్థకత లభిస్తుంది.

       ప్రతీ ఒక్కరు ఇంట్లో పూజ చేసుకుంటారు. దేవుడి మహిమనో ఏమో కానీ ఈ మధ్య నాస్తికులు కూడా దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. మరి రోజూ ఇంట్లో పూజ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా!! 

{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}

వినాయకుని శ్లోకం

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం 
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
***
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః 
{అని నమఃస్కారం చేసుకోవాలి}

******
శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
***

పవిత్రము


శ్లో||      అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం | సభాహ్యా అభ్యంతర శుచిః ||
పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః  ||

{ పంచపాత్రలోని నీటిని ఉద్దరిణితో తీసుకుని బొటన వేలితో 3సార్లు తలపై చల్లుకోవాలి }
******

అనంతరం ఏకాహారతి వెలిగించాలి


{ ఏకాహారతి వెలిగించి దానికి గంధం, పసుపు, కుంకుమ అలంకరించాలి }

దీపారాధన 

{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి వెలిగించాలి అంతే కానీ దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు}

శ్లో||  దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే ||

ఇతి దీపదేవతాభ్యో నమః

{దీపానికి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించాలి. ఆడవారు 5వత్తులు, మగవారు 3వత్తులు, హీనపక్షంలో కనీసం 2వత్తులు వెలిగించాలి}

[ ఓ దీప దైవమా! నీవు బ్రహ్మస్వరూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి, మా కోర్కెలన్నింటినీ తీర్చుమా అని అర్ధం ]


******
(దీపం వెలిగించి గంటను వాయిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను)

ఘంటా నాదము


శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||

[అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది]

******

ఆచమనం

( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)

ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా  --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
{ చెయ్యి కడుగుకోవాలి}
ఓం గోవిందాయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}

కేశవనామాలు

ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః 
 ఓం శ్రీకృష్ణాయ నమః
 ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః  --- ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)

******

భూశుద్ధి

{ఆచమానంతరం  - భూశుద్ధి కై భూతోచ్చాటన మంత్రము చదువుతూ  కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవలెను}

శ్లో||   ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

******

ప్రాణాయామం

శ్లో||  ఓం భూ: |  ఓం భువః | ఓం సువః ఓం మహః | ఓం జనః ఓం తపః ఓం సత్యం |
 ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }

******

సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం 
(కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా)
శుభే శోభనే ముహూర్తే
 ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః
 (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు)
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే - భరతఖండే
(India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి)
మేరోః దక్షిణ దిగ్భాగే
శ్రీశైలస్య____ (ఈశాన్య/వాయువ్య/... ) ప్రదేశే
(కృష్ణా / గంగా / గోదావర్యోః) మధ్యదేశే  (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి)
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) ____నదీసమీపే
నివాసిత గృహే (సొంత ఇల్లు అయితే "సొంత గృహే"అని చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన 
శ్రీ____నామ సంవత్సరే
ఉత్తరాయనే  / దక్షిణాయనే 
______ఋతవే ( 'గ్రీష్మ' - ఎండాకాలం / 'వర్ష' - వర్షాకాలం / 'వసంత' - చలికాలం
______మాసే (తెలుగు నెలలు  చైత్రం, వైశాఖం...)
______పక్షే  (శుక్ల పక్షం -- చంద్రుడు పెరుగుతుంటే  / కృష్ణ పక్షం -- చంద్రుడు తరుగుతుంటే)
______ తిధౌ (ఉదయం ఏ తిథి ప్రారంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి, విదియ... )
______ వాసరే (ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి. ఆది, సోమ...)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రః (గోత్రం)
అహం __________ నామ ధేయస్య (పేరు) 
ధర్మ పత్ని ______________ నామ ధేవతి (పేరు)
సఃకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}

నిర్విఘ్నేన  పూజా పరిసమాప్త్యర్ధం మహా గణాధి పతయే నమః

శ్రీ గురుభ్యో నమః 

******

కలశారాధన

తదంగ కలశారాధనం కరిష్యే
{మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను. కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేతితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను}

శ్లో||  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ||

గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి | 
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ||

ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః

కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై  చల్లాలి)

ఆత్మానాం సంప్రోక్ష్య (మన పైన)

పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యాల పైన చల్లాలి)

******

షోడశోపచార పూజ 

1) ఓం శివాయ నమః --- ధ్యానం సమర్పయామి 
2) ఓం పరమేశ్వరాయ నమః --- ఆవాహయామి
3) ఓం కైలాసవాసాయ నమః --- సింహాసనం సమర్పయామి
(సింహాసనార్ధం అక్షతాన్ సమర్పయామి)
4) ఓం గౌరీనాధాయ నమః --- పాదయో: పాద్యం సమర్పయామి
5) ఓం లోకేశ్వరాయ నమః --- హస్తయో: అర్ఘ్యం సమర్పయామి
6) ఓం వామదేవాయ నమః --- ముఖే ఆచమనీయం సమర్పయామి
7) ఓం రుద్రాయ నమః --- మధుపర్కం సమర్పయామి
8) ఓం వృషభవాహనాయ నమః --- పంచామృత స్నానం సమర్పయామి 
పంచామృత స్నానానంతరం శుద్దోదక స్నానం సమర్పయామి
9) ఓం దిగంబరాయ నమః --- వస్త్రయుగ్మం సమర్పయామి 
10) ఓం జగన్నాధాయ నమః --- యజ్ఞోపవీతం సమర్పయామి
11) ఓం భవాయ నమః --- ఆభరణం సమర్పయామి
(ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి)
12) ఓం కపాలధారిణే నమః --- గంధం సమర్పయామి
13) ఓం మహేశ్వరాయ నమః --- అక్షతాన్  సమర్పయామి
14) ఓం సంపూర్ణగుణాయ నమః --- పుష్పం సమర్పయామి

సూచన
* అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు స్వామికి చూపించి వేరొక పాత్ర లో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పళ్ళెము) లో వదలరాదు.
* మధుపర్కం సమర్పయామి అనగా స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని అర్ధం. ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు)
 * వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును. ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
* ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
******

అథాంగ పూజ

ఓం శంకరాయ నమః – పాదౌ పూజయామి
ఓం శివాయ నమః – జంఘే పూజయామి (పిక్కలు)
ఓం మహేశ్వరాయ నమః – జానునీ పూజయామి (మోకాళ్ళు)
ఓం త్రిలోకేశాయ నమః – ఊరుం పూజయామి (తొడలు)
ఓం వృషాభారూఢాయ నమః – గుహ్యం పూజయామి
ఓం భస్మోద్ధోళిత విగ్రయా నమః – కటిం పూజయామి(నడుము)
ఓం మృత్యుంజయాయ నమః – నాభిం పూజయామి
ఓం రుద్రాయ నమః – ఉదరం పూజయామి
ఓం సాంబాయ నమః – హృదయం పూజయామి
ఓం భుజంగభూషణాయ నమః – హస్తౌ పూజయామి
ఓం సదాశివాయ నమః – భుజౌ పూజయామి
ఓం విశ్వేశ్వరాయ నమః – కంఠం పూజయామి
ఓం గిరీశాయ నమః – ముఖం పూజయామి
ఓం త్రిపురాంతకాయ నమః – నేత్రాణి పూజయామి
ఓం విరూపాక్షాయ నమః – లలాటం పూజయామి
ఓం గంగాధరాయ నమః – శిరః పూజయామి
ఓం జటాధరాయ నమః – మౌళీం పూజయామి
ఓం పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి

******

అష్టోత్తర శతనామపూజ 


******
15) ఓం పార్వతీనాధాయ నమః ---  ధూపమాఘ్రాపయామి

16) ఓం తేజోరూపాయ నమః --- దీపం దర్శయామి

******

నైవేద్యం

 (నివేదన పదార్ధములపై నీరు చిలుకుచూ)
శ్లో||  ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం |
భర్గోదేవస్య ధీమహి - ధీయోయోనః ప్రచోదయాత్ ||

(క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో తిప్పాలి) 

(నైవేద్యం పగలు సమయంలో పెడితే)
 ఓం స్వత్యంత్వర్తేన పరిషించామి

(నైవేద్యం రాత్రి సమయంలో పెడితే)
ఋతంత్వా సత్యేన పరిషించామి 

(పుష్పంతో నైవేద్యంపై జలం ఉంచి)
అమృతమస్తు 

(అదే జలపుష్పాన్ని దేవుని వద్ద ఉంచి)
అమృతోపస్తరణమసి

ఓం లోకరక్షకాయ నమః --- నైవేద్యం సమర్పయామి

(5సార్లు దేవునికి నైవేద్యం చూపిస్తూ)
ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా -
 ఓం వ్యానాయ స్వాహా - ఓం ఉదానాయ స్వాహా -
 ఓం సమానాయ స్వాహా

(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన  5సార్లు చల్లాలి)
 మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి 
శుధ్ధాచమనీయం సమర్పయామి

******

తాంబూలం

ఓం కాలాయ నమః --- తాంబూలం సమర్పయామి

 {తాంబూలమును (మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి}

తాంబూల చరవణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి

(తాంబూలం వేసుకున్నాక  నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి)

******

నీరాజనం

(కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన ఏకాహారతి దీపంతో వెలిగించాలి)
ఓం త్రిలోచనాయ నమః --- కర్పూర నీరాజనం సమర్పయామి

కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
(నీరు హారతి కుంది చివర వదలాలి)

******

మంత్రపుష్పం

(మంత్రపుష్పమునకు అక్షతలు, పుష్పములు తీసుకొని విడువవలయును)

శ్లో||  ఓం పురుషస్య విద్మహే మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్


ఓం శంకరాయ నమః --- సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

******

ప్రదక్షిణ నమస్కారం

(అక్షతలు, పుష్పము తీసుకొని ప్రదక్షిణము చేయ వలయును)

శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ | 

తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే |

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః 
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా ||

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా |

ఓం భవాయ నమః --- ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి


******

సాష్టాంగ ప్రణామం

(మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి)

శ్లో|| ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా |

పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే || 

******

క్షమాప్రార్థన 

ఆ తరవాత మళ్లీ కూర్చుని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి)

శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరః
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే

అనయా ధ్యానావాహనాది షోడషోపచార పూజయాచ అష్టోత్తర నామార్చనాయచ మహా నివేదనాయచ భగవాన్‌ సర్వాత్మకః సర్వం శ్రీమహేశ్వర దేవతార్పణమస్తు

శ్రీ మహేశ్వర దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు

ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
(అంటూ అక్షతలనూ నీటినీ పళ్ళెంలో వదలాలి)

శ్లో|| ఉపచారాపదేశేన కృతాన్ అహర్ అహర్మయా |
అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ ||

ఓం మహేశ్వరాయ నమః - అపరాధ నమస్కారాన్ సమర్పయామి

శ్రీ పరమేశ్వర  ప్రసాదం శిరసా గృహ్ణామి

(పూజాక్షతలు శిరసున ధరించాలి)

******

విశేషోపచారములు


ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి
(నమస్కరించి అక్షతలు వేయాలి)

******

తీర్ధం


శ్లో|| అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |

      సమస్త పాపక్షయకరం శ్రీపరమేశ్వర పాదోదకం పావనం శుభమ్ ||

      (తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను. ప్రసాదం స్వీకరించాలి)


******

ఉద్వాసన 


ఓం పరమేశ్వరాయ నమః ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ

 (అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇంట్లో చేసుకునే నిత్య పూజకు ఉద్వాసన చెప్పాల్సిన అవసరం లేదు)


******
శుభం భూయాత్...
పూజా విధానము సంపూర్ణం

108 కామెంట్‌లు:

  1. చాలా స్పష్టంగా సూటిగా వివరంగా తెలియ చేసారు నమస్కారం- రవికాంత్ శర్మ

    రిప్లయితొలగించండి
  2. నిత్య పూజా విధానము తెలియపరచి నందుకు నా కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  3. Astotara satha navali roju cadavala dayachysi telupagalaru OM NAMASIVAYA

    రిప్లయితొలగించండి
  4. Chala baaga vrasaru..oka doubt amma..madhuparkam anaga paalu perugu thene kalipi samarpinchali ani chadiva..slokam ila undi..Om Dadhiksheera Samaayuktham
    Madhwaajyena Samanvitham,
    Madhuparkam grihaanedam..ananthalakshmi garu kooda youtube lo madhuparkalu gurinchi vivaristu madhuparkam anaga palu leda perugu thene lo rangarinchali annaru..telupagalaru..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ధన్యవాదాలు అండీ.. సదా శివార్పణమస్తు..


      మధుపర్కం అనగా తేనె మరియు పెరుగు రంగరించి ప్రయాణ బడలిక పోగొట్టుటకు సమర్పిస్తారు.. అలాగే వస్త్రయుగ్మము కూడా సమర్పించే సంప్రదాయం ఉంది..

      తొలగించండి
  5. శివాలయంలో కూడా చదువుకో సర్

    రిప్లయితొలగించండి
  6. శివాలయంలో కూడా చదువుకోవచ్చ సర్

    రిప్లయితొలగించండి
  7. వినాయక పూజ కోసం మీరు కేవలం రెండు శ్లోకాలు మాత్రమే ఇచ్చారు ...నిత్యపూజలో ఇవి సరిపోతాయా లేక విగ్నేశ్వరునికి కూడా షోడశఉపచారా పూజ చేయాల్సిందేనా ...

    రిప్లయితొలగించండి
  8. devudi mandiramlo anni vigrahalu, patalu untaikada, vigrahalaku, patalaku nitya snanam cheyincahali kada. apudu ee vidhanga cheyali, mantralu evi untai apudu ela cheyali. naku puja mantralu ravu. anni devudi vigrahalani snanamu cheyinchi bottu petti nivedyamu petti harati istanu. idi correcta or puzavidhanamu cheppandi dayachesi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజకి కావాల్సింది శ్రద్ధ.. భక్తి.. నిండు మనసుతో చేసేటప్పుడు మంత్రం రాకపోయినా పర్లేదు.. మంత్రాల అర్ధం కూడా అదే.. దేవుడా నీకు స్నానం చేయిస్తున్నా.. నైవేద్యం పెడుతున్నా..మంచినీళ్లు ఇస్తున్నా.. యజ్ఞోపవీతం ఇస్తున్నా.. ఇవే కదా మంత్రాలకు అర్ధాలు.. మనసు లేని మంత్రాలకన్నా మనసుతో చేసే ఉపచారాలు గొప్ప నా దృష్టిలో..

      కాబట్టి అయ్యో నాకు మంతం రాదు అని బాధపడేకన్నా శ్రద్ధగా భక్తితో పూజ చేసుకోండి.. తప్పు ఏమీ కాదు..

      తొలగించండి
    2. మంచిగా వివరించారు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు అండీ.. సదాశివార్పణమస్తు..

      తొలగించండి
    4. నిత్య పూజా విధానం వివరణ చాలా బాగుంది గురువు గారు

      తొలగించండి
  9. చాలా గొప్పగా చెప్పేరు అండి, బాగా అర్థ చేసుకున్నాను , మీకు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  10. శివోహం. అద్భుతం గా ఉంది.

    రిప్లయితొలగించండి
  11. నమస్కారం. ఏదైనా జపం ప్రారంభం లో మరియు సమాప్తం లో ఏమని చెప్పుకోవాలి కొంచెం వివరించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మామూలుగా దేశ కాలమానము సంకల్పం చదువుకొని, ......(దేవత పేరు) ప్రీత్యర్థం .....(సంఖ్య) అహం జపం కరిష్యే. (అని పాత్రలో నీరు వదలాలి.

      జపం అయిన తరువాత ...(దేవత పేరు) జపం సంపూర్ణం అని చెప్పి నీరు అదే పాత్రలో వదలండి. ఆ నీరు తీర్ధం గా పుచ్చుకొండి.

      ఆ జపం సంఖ్య పూర్తి అయ్యే వరకు తరువాత రోజు(లు)కూడా చేశేటప్పుడు, పూర్వోక్త సంకల్ప ప్రకారేణ, ....దేవతా ప్రీత్యర్థం జపం అహం కరిష్యే...అని చెప్పుకోవచ్చు.

      నమస్కారములు.

      తొలగించండి
    2. చక్కగా వివరించారండీ .. ధన్యవాదాలు..

      తొలగించండి
  12. నమస్కారం చదువు రాని వాళ్ళు మంత్రం లేకుండా పూజ చేయడం ఎలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనసు.. మనసు ముఖ్యం.. మనసు పెట్టి పూజ చెయ్యండి.. అన్నింటికన్నా ఎక్కువ ఫలితం..

      తొలగించండి
  13. గురువు ద్వారా నేర్చుకొని, ఇంకెవరైనా చేస్తూ ఉంటే, చూసి, గ్రహించి, గుర్తు పెట్టుకొని చేయవచ్చు.

    రిప్లయితొలగించండి
  14. మాలాంటి శూద్రులకు అర్థమయ్యె విధంగా బాగా వివరించారు. ధన్యవాదములు.
    🙏వుప్పరి నారాయణ ముదిరాజ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భగవంతునికి శూద్రులు, బ్రాహ్మణులు అనే తేడా ఉండదండి....🙏

      తొలగించండి
    2. ధన్యవాదాలు అండీ.. సదాశివార్పణమస్తు.. ఇక్కడ తరించవలసినది ఆత్మ.. బ్రాహ్మణుడా శూద్రుడా అని కాదు..

      తొలగించండి
  15. మంత్రాలు లేకుండా పూజ చేయవచ్చ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనసు.. మనసు ముఖ్యం.. మనసు పెట్టి పూజ చెయ్యండి.. అన్నింటికన్నా ఎక్కువ ఫలితం..

      తొలగించండి
  16. ఇది ఎలా డౌన్లోడ్ చేసూకోవచ్ గురువు గారు

    రిప్లయితొలగించండి
  17. నిత్య పూజావిధానం తెలియసేసినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  18. Baguga explain chesaru swami. Ee puja vidhananni download kani, print gani chesukone vilu vunte bagundedi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు అండీ.. సదాశివార్పణమస్తు.. బ్లాగ్ అడ్రస్ సేవ్ చేసుకుని చదువుకోండి..

      తొలగించండి
  19. పూజా విధానము చాలా బాగుంది అందరికి అర్థమవుతుంది కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  20. చాలా గొప్పగా, క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా నిత్య పూజా విధానము తెలిపారు... ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  21. నమస్కారం గురువుగారు, నిత్యపూజావిధానం చాలా స్పష్టంగా వివరించారు...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  22. చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు అండి.. శివార్పణమస్తు..

      తొలగించండి
    2. గురువుగారు కి నా కుటుంబం తరుపున మీకు ఇవే నా నమస్కారములు ఈ పూజ విధానం నాకు వాటషాప్ లొ pdf ధ్వారా పంపిన చో నా జీవితాంతం మీకు ఋణపడి ఉంటాను 9505553125

      తొలగించండి
  23. చాలా బాగుంది.ధన్యవాదము గురువు గారు.నాదో చిన్న విన్నపము ఏమిటంటే వినాయక స్వామి షో డసనామ పూజ కూడా వ్రాసి ఉంటే ఇంకా బాగుండేది.

    రిప్లయితొలగించండి
  24. మధుపర్కం గురించి వివరిచవలరు.వేరే బుక్ లో పాలు,తేనె, పెరుగు.మొదలగునవి కలిపితే మధుపర్కం అన్నారు.మీరు వస్త్రం అంటున్నారు. ఏది కరెక్టో వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  25. చాల చక్కగా వివరించేరండి. ధన్యవాదములు. కానీ ఇది ప్రింట్ చేసుకోడానికి వీలుగా ఉంటే ప్రజలకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది.

    రిప్లయితొలగించండి
  26. Sivakesavulu iruvuruni pujinchaalante mantraalu ela chadavaali.?sivuniki puja chestu aayaa dinaallo itara devatalni ela stutinchaali?naivedyam harati ela samarpinchaaliswami garu?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతా ఒక్కటే.. అది గుర్తించండి ముందు.. అద్వైతమే మన హిందూ ధర్మం.. మీకు బాగా గురి కుదిరిన ఒక దేవతనే ఆరాధిస్తూ పోతే చివరికి సత్యం తెలుసుకునే స్థాయికి వెళ్తారు. మనం చేరుకోవాల్సిన పరమపదం అదే..

      తొలగించండి
  27. ధన్య వాదములు గురువుగార్కి

    రిప్లయితొలగించండి
  28. Chala thanks andi intha vivaranga pettaru kani e pooja vidhanam non bramhins kuda patinchavacha.. gayatri mantram andaru chadavakudadu antaru kada..mari ela cheyali kasta chepagalara

    రిప్లయితొలగించండి
  29. Emtilo devathalaku puja chysena tharuvatha, tulasi kotaku puja chyala

    రిప్లయితొలగించండి
  30. అయ్యా షోడశోపచారాలలో 15వ మరియు16వ ఉపచారాలు అదంగా అష్టోత్తర ల తరువాత ఇచ్చారు అలాగే చెయ్యాలా లేక 14 తరువాత చెయ్యాలా

    రిప్లయితొలగించండి
  31. ఎంతో బాగా , ఎప్పుడూ చదవని వాళ్ళకు కూడా అర్ధం అందేటట్లు రాశారు.
    నేను మేరు రాసిన పూజా విధానాన్ని చదువుతూ రికార్డ్ చేసుకున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమశ్శివాయ. 🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  32. ధన్యవాదాలు గురువు గారు చాలా
    మంచిగా రాశారు

    రిప్లయితొలగించండి
  33. నమక చమకాలు ఎప్పుడు చెప్పాలో తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  34. Are you selling this book. I want to buy. How to do. Can i get by VPP?
    Ramakrishna rao
    9441037468

    రిప్లయితొలగించండి
  35. స్వామి బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు
    అలాగే అయ్యప్ప స్వామి నిత్య పూజ విధానం కూడా వివరించండి స్వామి

    రిప్లయితొలగించండి
  36. మీ నిత్య పూజా విధానం చాలా బాగుందండి ప్రతిరోజు మీరు చెప్పిన విధంగా పూజ చేసుకుంటున్నాను మీకు ధన్యవాదముల గోపయ్య

    రిప్లయితొలగించండి
  37. Swamy e vidam gane Venkateshwara Swamy pooja vidanam in temple ko ela cheyyali

    రిప్లయితొలగించండి
  38. హనుమాన్ దీక్ష పూజ గురించి వివరించడి

    రిప్లయితొలగించండి